స్థానిక గెలుపే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

స్థానిక గెలుపే లక్ష్యం

Sep 29 2026 1:39 AM | Updated on Sep 29 2026 1:39 AM

స్థానిక గెలుపే లక్ష్యం ప్రజాతీర్పుతో కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెబుదాం

జిల్లాల్లోని ఎనిమిది మున్సిపాలిటీలను గెలుచుకుందాం కూటమి అరాచక పాలనను ప్రజలకు వివరిద్దాం జగనన్న సంక్షేమ పాలనను ఇంటింటికి వెళ్లి గుర్తు చేద్దాం కష్టకాలంలో నిలబడిన కార్యకర్తకు జగనన్న 2.0లో అగ్రతాంబూలం చంద్రబాబు ప్రభుత్వంపై అన్నివర్గాల్లో ఆగ్రహం రైతులకు మద్దతు ధర లేదు.. వైఎస్సార్‌ సీపీ రీజినల్‌ కో–ఆర్డినేటర్‌, రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి పిడుగురాళ్లలో పల్నాడు జిల్లా మున్సిపల్‌ రివ్యూ సమావేశం హాజరైన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు

ప్రజాతీర్పుతో కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెబుదాం

పిడుగురాళ్ల: రాష్ట్రంలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అఖండ విజయం సాధించి కూటమి ప్రభుత్వానికి బుద్ధిచెబుదామని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రీజినల్‌ కోఆర్డినేటర్‌, రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలోని భవనాశి యల్లారావు కల్యాణ మండపంలో వైఎస్సార్‌ సీపీ పల్నాడు జిల్లా స్థాయి మున్సిపల్‌ రివ్యూ సమావేశం సోమవారం గురజాల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి నేతృత్వంలో జరిగింది. పట్టణ కన్వీనర్‌ మాదాల కిరణ్‌కుమార్‌ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా పార్టీ రీజినల్‌ కో–ఆర్డినేటర్‌, రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిలతోపాటు మాజీ మంత్రి విడదల రజని, మాజీ ఎమ్మెల్యేలు నంబూరు శంకరరావు, సత్తెనపల్లి సమన్వయకర్త డాక్టర్‌ గజ్జల సుధీర్‌భార్గవ్‌రెడ్డిలు హాజరయ్యారు.

పనిచేసే కార్యకర్తలకు పెద్దపీట

వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ... చంద్రబాబు ప్రభుత్వం ప్రజలకు చేసింది తక్కువ ఆర్భాటం ఎక్కువన్నారు. వైఎస్సార్‌ సీపీ శ్రేణులను ఇబ్బంది పెట్టి, అక్రమ కేసులు బనాయించి అరాచక పాలనను సాగిస్తున్నారన్నారు. వైఎస్సార్‌ సీపీ హయాంలో కులమత, పార్టీలనే బేధం లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందించిన ఘనత మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కిందన్నారు. కానీ నేడు చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధిని, ప్రజా సంక్షేమాన్ని మరిచి కక్షపూరిత పాలన సాగిస్తుస్తోంది. ప్రతి కార్యకర్త స్థానిక ఎన్నికలకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. జగనన్న ఈ సారి కార్యకర్తల కోసం 2.0 పాలన సాగించనున్నారన్నారు. చంద్రబాబు దగ్గర రెడ్‌బుక్‌ ఉంటే మన దగ్గర డిజిటల్‌ బుక్‌ ఉందని, ప్రతి ఒక్కరు ధైర్యంగా ముందుకు నడవాలని భరోసా ఇచ్చారు. పల్నాడు ప్రాంతంలో పోలీసులను అడ్డంపెట్టుకుని పార్టీ శ్రేణులపై అక్రమాలకు తెగబడ్డారన్నారు. కష్టకాలంలో నిలబడిన కార్యకర్తకు అధికారంలోకి వచ్చాక అగ్రతాంబూలం ఉంటుందన్నారు. జిల్లాల్లోని ఎనిమిది మున్సిపాలిటీల్లో పోటీ చేసి అఖండ విజయం సాధించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డి, పెదకూరపాడు, మాచర్ల, గురజాల, సత్తెనపల్లి నియోజకవర్గాల పరిశీలకులు యెనుముల మురళీధర్‌రెడ్డి, కొమ్మినేని వెంకటేశ్వర్లు, పడాల శివారెడ్డి, రేపాల శ్రీనివాసరావు, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ భవనాశి యల్లారావు, వడ్డెర కార్పొరేషన్‌ మాజీ చైర్‌పర్సన్‌ దేవళ్ల రేవతి, పట్టణ, మండల కన్వినర్లు మాదాల కిరణ్‌కుమార్‌, చింతా సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement