పీజీఆర్‌ఎస్‌కు 109 అర్జీలు | - | Sakshi
Sakshi News home page

పీజీఆర్‌ఎస్‌కు 109 అర్జీలు

Sep 29 2026 1:39 AM | Updated on Sep 29 2026 1:39 AM

పీజీఆర్‌ఎస్‌కు 109 అర్జీలు

నరసరావుపేట: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌)కు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్లా అధ్యక్షత వహించి అధికారులతో కలిసి పలు సమస్యలపై 109 అర్జీలు స్వీకరించారు. భూములకు సంబంధించిన సమస్యలపై చేపట్టిన రెవెన్యూ క్లినిక్‌కు జాయింట్‌ కలెక్టర్‌ సంజనా సింహ అధ్యక్షత వహించి 26 అర్జీలు స్వీకరించారు. ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించాలని, పారదర్శకంగా విచారణ నిర్వహించి నిర్ణీత గడువులోపు అర్జీదారుడు సంతృప్తి చెందేలా తప్పనిసరిగా పరిష్కరించాలని కలెక్టర్‌, జేసీ అధికారులను ఆదేశించారు. పింఛన్లు కావాలని, పింఛన్లు పెంచి ఇవ్వాలని, సర్వే, ఆన్‌లైన్‌ లోపాలు, పొలం గట్లు, ఇళ్ల మధ్య స్థలం వివాదాలు, కన్నబిడ్డల నిరాదరణ, తోబుట్టువుల మోసాలు తదితర సమస్యలపై అర్జీలు అందుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement