ఎల్‌నినోను సమర్థంగా ఎదుర్కోవాలి | - | Sakshi
Sakshi News home page

ఎల్‌నినోను సమర్థంగా ఎదుర్కోవాలి

Sep 26 2026 2:02 AM | Updated on Sep 26 2026 2:02 AM

● జిల్లా వ్యవసాయాధికారి ఐ.జగ్గారావు జిల్లాలో వ్యవసాయ ప్రస్తుత పరిస్థితి వివరించారు. 71 శాతం అంటే 1,03,847 హెక్టార్లలో వ్యవసాయ పంటలు, 66 శాతం అంటే 44,700 హెక్టార్లలో ఉద్యాన పంటలు వేశారన్నారు. వర్షపాతం ఆగస్టు నెలలో 69 శాతం లోటుగా ఉందని, సెప్టెంబరులో 22 శాతం అధికంగా పడిందన్నారు. జిల్లా వ్యాప్తంగా 33 శాతం లోటు ఉందన్నారు. మాచర్ల ఎమ్మెల్యే మాట్లాడుతూ తమ నియోజకవర్గం దుర్గి, వెల్దుర్తి, మాచర్ల రూరల్‌ మండలంలో చాలా తక్కువగా వర్షపాతం నమోదైందన్నారు. మంత్రి మాట్లాడుతూ ప్రత్యేకంగా ఒక సమావేశం ఏర్పాటుచేసి ఎక్కడెక్కడ పంటలు వేశారు, పరిస్థితి ఏమిటో చర్చిద్దామని కలెక్టర్‌కు సూచించారు. ● మాచర్లలో అమృత పథకం కింద రెండు కిలోమీటర్ల మేర పైపులైను వేశామని సంబంధిత అధికారి చెబుతుండగా ఎమ్మెల్యే స్పందిస్తూ పైపులు మున్సిపల్‌ కార్యాలయంలో పడేసి బిల్లులు తీసుకొని పోతున్నారని, లైను వేశామని చెబుతారమిటని ప్రశ్నించారు. జేసీ సంజనా శ్రీహర్ష మాట్లాడుతూ ఇళ్ల కోసం పల్నాడు జిల్లాలో 36,700 దరఖాస్తులు ఈ నెల 15 వరకు అందాయని, సిక్స్‌ స్టెప్స్‌ వాలిడేషన్‌ అమలుచేయగా వీటిలో అర్హత కల్గినవి 14 వేలని తెలిపారు. మిగతా వాటిని తిరస్కరించామన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ కొన్ని మండలాల నుంచి చాలా తక్కువగా దరఖాస్తులు వచ్చాయని, తహసీల్దార్లను అప్రమత్తం చేయటం జరిగిందన్నారు. మంత్రి మాట్లాడుతూ జిల్లాలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. అమరజీవి జలధార ప్రాజెక్టులు జల్‌జీవన్‌ మిషన్‌ 2.0 పనులను వేగవంతం చేయాలని కోరారు. పెన్షన్ల దరఖాస్తు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్‌ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. హౌస్‌ హోల్డ్‌ సర్వే సమస్యలను ఇప్పటికే ప్రభుత్వం పరిష్కరించిందని తెలిపారు. ఇప్పటికే పంటలు వేసే సాగు చేస్తున్న కౌలు రైతులకు ఎరువుల కొరత రాకుండా చూడాలని, బ్లాక్‌ మార్కెటింగ్‌ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశామన్నారు. ఖాళీ భూములను సాగులోకి తీసుకువచ్చి పీఎండీఎస్‌ పంటలను విస్తృతంగా సాగుచేయడం ద్వారా రైతులు అదనపు ఆదాయం పొందడంతో పాటు పశుగ్రాస కొరతను అధిగమించవచ్చంటూ రెతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఆయిల్‌ పామ్‌ సాగు 972 హెక్టర్లు పెరిగిందన్నారు. తైవాన్‌ స్ప్రేలు ప్రతి నియోజకవర్గానికి ఇవ్వాలని, ప్రతి నియోజకవర్గంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించిన పంటల డెమో మోడల్‌లు శాసనసభ్యుల ద్వారా రైతులకు అవగాహన, ప్రోత్సాహం కల్పించాలి అన్నారు. వరికెపూడిశెల ప్రాజెక్ట్‌ భూసేకరణ వేగవంతం చేయాలని, ప్రజాభిప్రాయ సేకరణ అక్టోబర్‌ 25న నిర్వహిస్తున్నామని కలెక్టర్‌ తెలిపారు. పల్లెపండుగ ద్వారా జిల్లాలో ఇప్పటి వరకు 576 గోకులాలు పూర్తిచేసామని అధికారులు తెలిపారు, పీఎం సూర్యఘర్‌ పురోగతి వేగవంతం చేయాలని, సాగర్‌ ప్రాజెక్ట్‌ క్వార్టర్స్‌ పరిధిలో ప్రతి ఇంటికి ఒక సబ్‌ మీటర్‌ ఏర్పాటు చేయాలని కోరారు. ప్రజా సమస్యల పరిష్కారం దిశగా పనిచేయాలని, సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించాలని తెలిపారు. పలు విభాగాల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

పల్నాడు జిల్లా సమీక్ష సమావేశంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ తాగునీటి ట్యాంకులను నింపి గ్రామాల్లో సమస్య రాకుండా చూడాలి అమరజీవి జలధార, జల్‌ జీవన్‌ మిషన్‌ 2.0 పనులు వేగవంతం చేయాలి జిల్లాలో 71 శాతమే పంటలు సాగు చేశారన్న జిల్లా వ్యవసాయాధికారి ఇంకా 23 శాతం లోటు వర్షపాతం

నరసరావుపేట: ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన వర్షాభావ పరిస్థితులు దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రైతులు వరి పంట వేయవద్దని, ప్రత్యామ్నాయ, అంతర పంటల వైపు రైతాంగం దృష్టి సారించాలని రాష్ట్ర విద్యుత్‌ శాఖ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ తెలిపారు. జిల్లా కలెక్టరేట్‌లో శుక్రవారం తొలి జిల్లా సమీక్ష సమావేశం మంత్రి అధ్యక్షతన నిర్వహించారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్లా, సంయుక్త కలెక్టర్‌ సంజనా శ్రీహర్ష, ప్రభుత్వ చీఫ్‌ విప్‌, వినుకొండ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్‌, నరసరావుపేట, సత్తెనపల్లి, చిలకలూరిపేట, మాచర్ల శాసనసభ్యులు డాక్టర్‌ చదలవాడ అరవిందబాబు, కన్నా లక్ష్మీనారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, జూలకంటి బ్రహ్మానందరెడ్డి, జిల్లా సహకార బ్యాంకు చైర్మన్‌ మక్కెన మల్లికార్జునరావు పాల్గొన్నారు. ఎల్‌నినో ప్రభావం, ఎరువుల కొరత, పంట మద్దతు ధర, పీఎం సూర్యఘర్‌, పల్లె పండుగ 2.0, ప్రకృతి వ్యయసాయం, స్వయం సహాయక సంఘాల క్లస్టర్‌ల స్థాపన, పశుపోషణ, నిత్యావసర వస్తువుల ధరలు, కౌలు రైతుల సమస్యలు, జల్‌ జీవన్‌ మిషన్‌ 2.0 పనులు, ఎన్టీఆర్‌ భరోసా సామాజిక పెన్షన్‌లకు దరఖాస్తుల స్వీకరణ, సూపర్‌ సిక్స్‌ పథకాల అమలు తీరుపై చర్చించారు.

14 వేల ఇళ్ల దరఖాస్తులకు ఆమోదం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement