ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక నిన్నటి వరకు కృష్ణా నది జలకళ కోల్పోయింది. అల్పపీడన ప్రభావంతో రెండు రోజులుగా ఎగువ ప్రాంతాలలో కురిసిన వర్షాలకు జలకళను సంతరించుకుంది. గురువారం సాయంత్రం నుంచి అమరావతి వద్ద సుమారు ఎనిమిది అడుగులకుపైగా నీటిమట్టం పెరిగింది. పరీవాహక గ్రామాలైన మునగోడు, పొందుగల ధరణికోట, వైకుంఠపురం, అమరావతి, ముత్తాయిపాలెం, దిడుగు గ్రామాలలో కొంతమేర పత్తి చేలలోకి నీరు చేరింది. పెదమద్దూరు వద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. మద్దూరువాగుపై హైలెవల్ బ్రిడ్జిపైకి నీరు రాకపోయినా.. రెండు వైపులా ఉన్న రోడ్లపైకి వరద చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ప్రధానంగా అమరావతి వైపు ఉన్న రోడ్డుపై నాలుగు అడుగులమేర నీరు ప్రవహిస్తోంది.
–అమరావతి


