పిడుగురాళ్ల రూరల్: హెచ్‌ఐవీ పట్ల సమాజంలో ఇంకా నెలకొన్న అపోహలను తొలగించడమే ప్రచార ముఖ్య ఉద్దేశమని కామేపల్లి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వైద్యులు స్నేహశ్రీ, అఖిల్ దాస్ అన్నారు. పిడుగురాళ్ల మండలం కామేపల్లి గ్రామంలోని మెడికల్ విద్య, వైద్యశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో ఎల్‌ఈడీ ప్రచార రథం ఆదివారం ప్రారంభించారు. వారు మాట్లాడుతూ పల్నాడు జిల్లాలో 15 రోజులపాటు ఎల్‌ఈడీ రథం వివిధ ప్రాంతాలు, గ్రామాలు తిరుగుతూ హెచ్‌ఐవీ వ్యాప్తి చెందే విధానాలు, తదితర జాగ్రత్తలపై లఘు చిత్రాలు, ఆడియో–విజువల్ సందేశాల ద్వారా ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో లింక్ వర్కర్ స్కీమ్, డిస్ట్రిక్ట్ రిసోర్స్‌పర్సన్ వాసుదేవరావు, లింక్ వర్కర్ స్కీమ్ జోనల్ సూపర్‌వైజర్ వై.విశ్వేశ్వరరావు, లింక్ వర్కర్ దీనకుమారి, ఐసీటీసీ కౌన్సిలర్ నాగరాజు, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది, ఆయా గ్రామాల ఆశా వర్కర్లు పాల్గొన్నారు.


