తాడేపల్లి రూరల్: గుంటూరు జిల్లా తాడేపల్లిలోని మణిపాల్ హాస్పిటల్ అందిస్తున్న ఆధునిక వైద్యసేవలకు గుర్తింపుగా ఇటి హెల్త్‌కేర్ అవార్డ్స్–2026లో రెండు ప్రతిష్ఠాత్మక అవార్డులు అందుకున్నట్లు హాస్పిటల్ డైరెక్టర్ శ్రీరామాంజనేయరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అవయవ మార్పిడి చికిత్సలో నైపుణ్యం, వివిధ వైద్య విభాగాల సమన్వయంతో అందించే క్లినికల్ కేర్, అత్యాధునిక చికిత్సా విధానాలు, సమగ్ర వైద్యసేవలు అందించడంలో చూపుతున్న నిబద్ధతకు గుర్తింపుగా ‘హాస్పిటల్ ఆఫ్ ది ఇయర్, ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సౌత్’ అవార్డు లభించిందని తెలిపారు. మణిపాల్ హాస్పిటల్‌లో ఆర్థోపెడిక్స్ అండ్ రోబోటిక్ జాయింట్ రీప్లేస్‌మెంట్ సర్జరీ వైద్యులు డాక్టర్ జీవీ రెడ్డికి ‘ఆర్థోపెడిక్ సర్జన్ ఆఫ్ ది ఇయర్–సౌత్’ అవార్డు వచ్చినట్టు వివరించారు. ఈ రెండు అవార్డులు తమ హాస్పిటల్‌కు ప్రత్యేకమైన గుర్తింపుగా నిలుస్తాయని ఆయన తెలిపారు.


