వేధింపులు నుంచి
రక్షణ కల్పించండి
జిల్లా అదనపు ఎస్పీ రోహిత్‌కుమార్ చౌదరి జిల్లా పోలీసు కార్యాలయంలో పీజీఆర్‌ఎస్ అర్జీలు స్వీకరించిన అదనపు ఎస్పీ
నరసరావుపేట రూరల్: పీజీఆర్‌ఎస్ అర్జీలను సత్వరం పరిష్కరించాలని జిల్లా అదనపు ఎస్పీ రోహిహిత్ కుమార్ చౌదరి అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం పీజీఆర్‌ఎస్ నిర్వహించారు. పీజీఆర్‌ఎస్‌లో రోహిత్ కుమార్ చౌదరి పాల్గొని అర్జీలు స్వీకరించారు. ఆర్థిక, కుటుంబ సమస్యలు, పలు మోసాలకు సంబంధించిన సమస్యలు, బెదరింపులు, ఆక్రమణలు వంటి అంశాలకు సంబంధించిన 82 ఫిర్యాదులు అందాయి. పీజీఆర్‌ఎస్‌లో వచ్చిన మహిళలు, వృద్ధులకు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారంలో ప్రత్యేక చొరవ చూపాలని సూచించారు. క్షేత స్థాయిలో విచారణ వేగవంతం చేసి చట్ట ప్రకారం న్యాయం చేయాలని ఆదేశించారు.
నాకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు కిరణ్‌కుమార్ గుంటూరులో నివాసం ఉంటున్నాడు. కొంతకాలంగా బెట్టింగ్, జూదాలకు అలవాటుపడి డబ్బును దుర్వినియోగం చేశాడు. ఆర్థిక నష్టాలు భరించాలని బెదిరిస్తున్నాడు. 2025లో రూ.30 లక్షలు ఇచ్చానని, మిగిలిన ఆస్తి కోసం కుమారుడు, కొడలు అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు.
–చీమకుర్తి సుబ్రహ్మణ్యం,
పిడుగురాళ


