వైభవంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు | - | Sakshi
Sakshi News home page

వైభవంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు

Sep 5 2026 5:31 AM | Updated on Sep 5 2026 5:31 AM

వైభవంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు

చిన్నారుల కేరింతల మధ్య ఉట్లోత్సవం హరేకృష్ణ నామ స్మరణతో ఆధ్యాత్మిక శోభ

నరసరావుపేట ఈస్ట్‌: శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకొని బరంపేటలోని శ్రీ రాధా గోవింద చంద్రమందిరం (ఇస్కాన్‌) హరే కృష్ణ నామస్మరణతో మారుమోగింది. ఆలయాన్ని పూలమాలలతో అలంకరించి, రంగవల్లులు తీర్చిదిద్దారు. తెల్లవారుజామున 4.30 గంటలకు శ్రీ రాధా గోవిందులకు శుభమంగళ హారతి సమర్పించారు. అభిషేకాలు, ప్రత్యేక అలంకరణలతో ఉదయం 8.30 గంటలకు శుభదర్శన హారతితో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. శ్రీమద్భాగవత ప్రవచనం, మహా హరినామ సంకీర్తనలతో ఆలయం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. తల్లిదండ్రులు తమ చిన్నారులకు రాధాకృష్ణుల అలంకరణ చేసి ఆలయానికి తీసుకువచ్చారు. సాయంత్రం ఆలయ ఆవరణలో నిర్వహించిన ఉట్లోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చిన్నారులు ఉట్టి కొట్టేందుకు ఉత్సాహం చూపారు. సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. రాత్రి ఉత్సవమూర్తులకు 56 రకాల ద్రవ్యాలతో మహాశంఖాభిషేకం, 108 రకాల భక్ష్యాలతో మహారాజభోగ నివేదన నిర్వహించారు. అనంతరం భక్తులకు ఏకాదశి ప్రసాద వితరణ గావించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement