జాతీయస్థాయి స్విమ్మింగ్‌ పోటీలకు పల్నాడు క్రీడాకారులు | - | Sakshi
Sakshi News home page

జాతీయస్థాయి స్విమ్మింగ్‌ పోటీలకు పల్నాడు క్రీడాకారులు

Sep 5 2026 5:07 AM | Updated on Sep 5 2026 5:07 AM

జాతీయస్థాయి స్విమ్మింగ్‌ పోటీలకు పల్నాడు క్రీడాకారులు

నరసరావుపేట ఈస్ట్‌: జాతీయస్థాయి స్విమ్మింగ్‌ పోటీలకు పల్నాడు జిల్లా నుంచి ఇద్దరు క్రీడాకారులు ఎంపికై నట్టు పల్నాడు జిల్లా స్విమ్మింగ్‌ అసోసియేషన్‌ కార్యదర్శి వై.వి.సుబ్బారెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఈనెల ఏడో తేదీ నుంచి 12వ తేదీ వరకు జరగనున్న 52వ జూనియర్‌ నేషనల్‌ అక్వాటిక్‌ చాంపియన్‌షిప్‌ పోటీలలో వాటర్‌ పోలో విభాగంలో పల్నాడు జిల్లాకు చెందిన ఆర్‌.లోహిత్‌, కె.రుద్రప్రతాప్‌ సైదులురెడ్డి పాల్గొంటారని తెలిపారు. ఏపీ స్విమ్మింగ్‌ కోచ్‌ జి.సురేష్‌ పర్యవేక్షణలో శ్రీసుబ్బరాయ అండ్‌ నారాయణ కళాశాల స్విమ్మింగ్‌ పూల్‌లో శిక్షణ పొందారని తెలిపారు. జాతీయస్థాయి పోటీలో క్రీడాకారులు లోహిత్‌, రుద్రప్రతాప్‌లు ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహిస్తారని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement