ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనే ఏకై క మార్గం ప్రకృతి వ్యవసాయం | - | Sakshi
Sakshi News home page

ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనే ఏకై క మార్గం ప్రకృతి వ్యవసాయం

Sep 4 2026 1:48 AM | Updated on Sep 4 2026 1:48 AM

ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనే ఏకై క మార్గం ప్రకృతి వ్యవసాయం

జర్మనీ శాస్త్రవేత్త వాల్టర్‌

నార్నెపాడు(ముప్పాళ్ళ): ఎల్‌నినో ప్రభావాన్ని సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు ప్రకృతి వ్యవసాయ విధానాలే ఏకై క మార్గమని జర్మనీకి చెందిన శాస్త్రవేత్త వాల్టర్‌ అన్నారు. మండలంలోని నార్నెపాడు గ్రామంలో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన వ్యవసాయ శాస్త్రవేత్త సడానా, ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్ట్‌ మేనేజర్‌ కే.అమలకుమారిలతో కలిసి గురువారం సందర్శించారు. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు ఏటీఎమ్‌ మోడల్‌ విధానాన్ని అవలంభిస్తే ఏడాది పొడవునా వివిధ పంటల ద్వారా ఆదాయం పొందవచ్చని శాస్త్రవేత్త వాల్టర్‌ తెలిపారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో సాగు చేస్తున్న పంటలపై ఎల్‌నినో ప్రభావం పెద్దగా కనిపించకపోవడం పట్ల శాస్త్రవేత్తలు సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వైఆర్‌ఎఫ్‌ ధనలక్ష్మి, జిల్లా సిబ్బంది సైదయ్య, ఫార్మర్‌ మాస్టర్‌ ట్రైనర్‌ కే.పూజ, ప్రకృతి వ్యవసాయ రైతులు, మహిళలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement