నరసరావుపేట రూరల్: కాకానిలోని జేఎన్‌టీయూఎన్ ఇంజినీరింగ్ కళాశాల క్యాంపస్‌ను సోమవారం జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా సందర్శించారు. కళాశాలలో రూ.70 కోట్లతో నిర్మించిన వసతి గృహాల భవనాలను ఈ నెల 2వ తేదీన రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో వసతి గృహ భవనాలను కలెక్టర్ పరిశీలించారు. మంత్రి లోకేష్ పర్యటనలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు పలు సూచనలు చేశారు. వసతి గృహంలో గదులను పరిశీలించి చేపట్టాల్సి పనులపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో ఆర్‌డీవో బాలకృష్ణ, కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్‌తో పవర్‌గ్రిడ్ అధికారుల సమావేశం..
నరసరావుపేట: జిల్లాలో ట్రాన్స్ మిషన్ లైన్లు, సబ్‌స్టేషన్ కోసం భూమి పరిహారంపై పవర్‌గ్రిడ్ సీనియర్ అధికారులు కె.సుధాకరరావు, ఆర్.రాములు జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లాతో క్యాంపు కార్యాలయంలో సోమవారం సమావేశం నిర్వహించారు. 765 కేవీ, 400 కేవీ ట్రాన్స్‌మిషన్ లైన్ల నిర్మాణానికి రైతులకు ఇవ్వబోయే భూమి, రోడ్డు కారిడార్ పరిహారం, టవర్ బేస్ పరిహారంపై చర్చించారు. పిడుగురాళ్ల మండలంలో 765 కేవీ సబ్‌స్టేషన్ నిర్మాణం కోసం భూమి సేకరణకు సంబంధించి కలెక్టర్‌కు అధికారిక అభ్యర్థన పత్రాన్ని సమర్పించారు. రెవెన్యూ, పవర్‌గ్రిడ్ అధికారులు పాల్గొన్నారు.


