న్యాయవాద వృత్తి ఉన్నతమైనది | - | Sakshi
Sakshi News home page

న్యాయవాద వృత్తి ఉన్నతమైనది

Sep 1 2026 1:37 AM | Updated on Sep 1 2026 1:37 AM

నరసరావుపేట టౌన్‌: అన్ని వృత్తుల్లోకి ఉన్నతమైనది న్యాయవాద వృత్తి అని స్థానిక 13వ అదనపు జిల్లా సెషన్స్‌ న్యాయాధికారి ఎస్‌.రమేష్‌ సోమవారం అన్నారు. ఆయన పదవీ విరమణ సందర్భంగా న్యాయవాద సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. నరసరావుపేటలో విధులు నిర్వహించడం సంతృప్తికరంగా ఉందన్నారు. ప్రతిభ, నైపుణ్యం కలిగిన న్యాయవాదులకు నెలవు నరసరావుపేట అన్నారు. యువ న్యాయవాదులు క్రమశిక్షణతో శ్రమించి ఉన్నత స్థానాలకు ఎదగాలన్నారు. అనంతరం దివంగత న్యాయవాదులు రావిళ్ల లక్ష్మీనారాయణ, గుండాల సురేష్‌ బాబు, చిట్టి మాల సురేష్‌ల చిత్రపటాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో స్థానిక న్యాయాధికారులు కిరణ్‌ కుమార్‌, జోష్ణశ్రీ, న్యాయవాద సంఘ అధ్యక్షుడు జీవీ సుబ్బారావు, పలువురు సీనియర్‌, జూనియర్‌, మహిళ న్యాయవాదులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement