నరసరావుపేట రూరల్: ఉద్యోగ విరమణ పొందిన పోలీసు అధికారులు, సిబ్బంది సత్కారం కార్యక్రమం జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించారు. జిల్లా అదనపు ఎస్పీ రోహిత్‌కుమార్ చౌదరి కార్యక్రమంలో పాల్గొని సిబ్బందిని ఘనంగా సత్కరించారు. జిల్లా అదనపు ఎస్పీ వి.సత్తిరాజు, పీసీఆర్ ఎస్‌ఐ కె.నరసదాసు, ఎస్‌బీ ఏఎస్‌ఐ ఎండీ జిలాని, ఏఎస్‌ఏలు పి.మధుసుధనరావు, ఎస్.వీరాంజనేయులు, హెడ్ కానిస్టేబుల్స్ జి.రమాదేవి, ఎస్‌కె కరీముల్లా, కానిస్టేబుల్ ఆర్.సాంబశివరావు, ఎస్.పోతురాజులు ఉద్యోగ విరమణ పొందిన వారిలో ఉన్నారు. ఈ సందర్బంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం సుదీర్ఘకాలం పని చేసి ఉద్యోగ విరమణ పొందిన సిబ్బంది సేవలు శ్లాఘనీయమన్నారు. కార్యక్రమంలో హోంగార్డ్ ఆర్‌ఐ ఎస్.కృష్ణ, వెల్పేర్ ఆర్‌ఐ ఎల్.గోపినాథ్, పోలీసు వెల్పేర్ అసోసియేషన్ అధ్యక్షుడు టి.మాణిక్యాల రావు, సిబ్బంది పాల్గొన్నారు.


