నకరికల్లు: ఉమ్మడి గుంటూరు జిల్లా జూనియర్ బాలబాలికల ఖో–ఖో జట్ల ఎంపిక పూర్తయింది. జిల్లా ఖో–ఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో నకరికల్లులోని వంగా వెంకటరెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా జట్ల ఎంపిక ఆదివారం నిర్వహించారు. ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి 160 మంది క్రీడాకారులు, 90 మంది క్రీడాకారిణులు పోటీలకు హాజరయ్యారు. ఉత్కంఠభరితంగా సాగిన ఎంపిక పోటీల ద్వారా స్టాండ్‌బై క్రీడాకారులతో కలిపి 22 మందితో బాలికల జట్టు, 19 మందితో బాలుర జట్లను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సెక్రెటరీ చింతా పుల్లయ్య మాట్లాడుతూ ఎంపికై న జట్లలో బాలుర జట్టుకు గుంటూరులోని టీజేపీఎస్ కళాశాలలో, బాలికల జట్టుకు నకరికల్లులోని ఎస్‌వీఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 12 వరకు శిక్షణ జరుగుతుందని అన్నారు. అనంతరం సెప్టెంబర్ 13, 14, 15 తేదీల్లో ఎన్‌టీఆర్ జిల్లా కంచికచర్లలో నిర్వహించే రాష్ట్రస్థాయి జూనియర్ ఖో–ఖో పోటీల్లో ఉమ్మడి గుంటూరు జిల్లా తరఫున పాల్గొంటారని అన్నారు. గుంటూరు జిల్లా ఖో–ఖో అసోసియేషన్ సీఈఓ దాసరి కోటేశ్వరరావు, అధ్యక్షుడు వీరభద్రారెడ్డి, కార్యదర్శి చింతా పుల్లయ్య, మాజీ కార్యదర్శి రావి కిషోర్ ఎంపికను పర్యవేక్షించారు. ఎంపికకు న్యాయ నిర్ణేతలుగా ఫిజికల్ డైరెక్టర్ జి.ఝాన్సీరాణి, క్రీడా ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు కళ్యాణి, మద్దం వెంకటేశ్వర్లు, వెంకటేశ్వర్లు, వీరయ్య, చినబాబు, పెద్దబాబు, చిన రత్తయ్య, నర్శింహారావు, స్వర్ణ రాజు, శ్రీను పాల్గొన్నారు.
జూనియర్ బాలికల జట్టు క్రీడాకారులు వీరే...
రంగా మహాలక్ష్మి, సీహెచ్.త్రివేణి, బి.లాస్య, షేక్.ఫర్హాన, ఎస్.హేమ శివ వర్షిణి, పి.షాహినా, ఎన్.లావణ్య, వై.హర్షిత, బి.నందిని, ఏ.అనూష, టి.లిఖిత, బి.సౌజన్య, సీహెచ్.విజయ, జె.నాగవేణి, కె.బుజ్జిలతో పాటు స్టాండ్‌బైలో మరో ఏడుగురిని ఎంపిక చేశారు.
జూనియర్ ఖో–ఖో బాలుర జట్టులో
క్రీడాకారులు వీరే
షేక్.నబీరసూల్, ఏ.శ్రీనివాస్, ఎం.శ్రీకాంత్, యు.మనోహర్, కె.వి.గోపిచంద్, షేక్.ఆసిఫ్, ఏ.హనుమప్రసాద్, ఎన్.సాయిచరణ్, ఏ.కోమలేష్, డి.ఏడుకొండలు, వి.నందకిశోర్, పి.శివకార్తీక్, ఎస్.రామ్‌చరణ్, డి.శివగణేష్, ఎం.రవికరణ్‌లతో పాటు మరో నలుగురిని స్టాండ్‌బైగా ఎంపిక చేశారు.


