హైవేపై కంకర టిప్పర్‌ బోల్తా | - | Sakshi
Sakshi News home page

హైవేపై కంకర టిప్పర్‌ బోల్తా

Aug 30 2026 4:49 AM | Updated on Aug 30 2026 4:49 AM

హైవేపై కంకర టిప్పర్‌ బోల్తా

నరసరావుపేట రూరల్‌: కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్‌ గుంటూరు– కర్నూలు హైవేపై బోల్తా కొట్టిన ఘటన మండలంలోని ఉప్పలపాడు సమీపంలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. కంకరలోడ్‌తో ఉప్పలపాడు వైపు నుంచి నరసరావుపేట పట్టణానికి వస్తున్న లారీ వేగాన్ని నిరోధించే క్రమంలో అదుపుతప్పి రోడ్డుపైనే పల్టీ కొట్టింది. ఈ ఘటనలో ఎటువంటి ప్రమాదం చోటుచేసుకోలేదు. డ్రైవర్‌ను స్థానికులు క్షేమంగా బయటకు తీసారు. రోడ్డుకు అడ్డుగా టిప్పర్‌ పడటంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్‌ నిలిచిపోయింది. రూరల్‌ పోలీసులు అక్కడకు చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు. కంకరను జేసీబీతో బయటకు తీసిన అనంతరం టిప్పర్‌ను నిలబెట్టి అక్కడ నుంచి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement