చిలకలూరిపేటటౌన్: ఫ్లయింగ్ టెన్నిస్ సౌత్ జోన్‌న్ చాంపియన్‌న్‌షిప్ పోటీలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రజట్టు సిద్ధమైంది. జులైలో ఆంధ్రప్రదేశ్ ఫ్లయింగ్ టెన్నిస్ అసోసియేషనన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఎంపిక పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను సౌత్ జోన్‌న్ చాంపియనన్ షిప్ కోసం రాష్ట్ర జట్టుకు ఎంపిక చేశారు. జూనియర్, సబ్ జూనియర్, సీనియర్ బాలబాలికల విభాగాల్లో మొత్తం 24 మంది క్రీడాకారులు ఏపీ తరఫున పోటీల్లో పాల్గొననున్నారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో నిర్వహించనున్న సౌత్ జోన్‌న్ చాంపియనన్ షిప్‌లో వీరు తమ ప్రతిభను చాటనున్నారు. బాలుర జట్టుకు యు నవీన్‌న్‌కోచ్‌గా, బాలికల జట్టుకు కె కావ్య, సాగర్‌రాణి కోచ్‌లుగా వ్యవహరించనున్నారు. రాష్ట్ర జట్టుకు ఎంపికై న వివరాలను ఫ్లయింగ్ టెన్నిస్ అసోసియేషన్‌న్ అధ్యక్షుడు డాక్టర్ కొల్లా సతీష్‌కుమార్, కార్యదర్శి బొంత కృపారావు, వైస్ ప్రెసిడెంట్ ఇ శ్రీకాంత్, మోడ్రన్‌సంస్థల అధినేత చేబ్రోలు మహేష్ వెల్లడించారు. సౌత్ జోనన్ చాంపియన్‌న్‌షిప్‌లో క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి విజయాలు సాధించాలని అసోసియేషనన్ ప్రతినిధులు ఆకాంక్షించారు. పోటీల్లో రాణించి ఆంధ్రప్రదేశ్‌కు మంచి పేరు తీసుకురావాలని క్రీడాకారులకు వారు సూచించారు.


