భూముల రీ సర్వే వేగవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

భూముల రీ సర్వే వేగవంతం చేయాలి

Aug 29 2026 1:46 AM | Updated on Aug 29 2026 1:46 AM

నరసరావుపేట: భూముల రీ సర్వే పనులను నిర్దేశిత మార్గదర్శకాలకు అనుగుణంగా వేగవంతంగా పూర్తిచేయాలని తహసీల్దార్లను జాయింట్‌ కలెక్టర్‌ సంజనా సింహ ఆదేశించారు. రీసర్వే పురోగతిపై జేసీ కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఆర్‌డీఓలు, సర్వే అధికారులు, తహసీల్దార్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వివిధ మండలాల్లో చేపడుతున్న ఫీల్డ్‌ స్థాయి పనులు, పెండింగ్‌లో ఉన్న అంశాలు, లక్ష్యాల సాధనపై చర్చించారు. జేసీ మాట్లాడుతూ పెండింగ్‌ పనులపై ప్రత్యేక దృష్టి సారించి క్షేత్రస్థాయిలో సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. నిర్దేశిత గడువులోగా లక్ష్యాలను సాధించేలా చూడాలన్నారు. పీజీఆర్‌ఎస్‌లో వచ్చే సర్వే సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు.

జాయింట్‌ కలెక్టర్‌ సంజన సింహ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement