న్యూస్‌రీల్
శుక్రవారం శ్రీ 7 శ్రీ ఆగస్టు శ్రీ 2026
డీఎస్సీ పరీక్షతో దగా పడ్డ యువత కోసం వైఎస్సార్ సీపీ శ్రేణులు గళమెత్తగా.. నిరుద్యోగులు, మహిళలు, ప్రజలు వారితో గొంతు కలిపారు. కదం కలిపి.. అవినీతి సర్కారు నిద్రమత్తు వదిలేలా నిరసన గళం వినిపించారు. శాంతియుతంగా జరుగుతున్న నిరసనలు అడ్డుకోవాలని పోలీసుల ద్వారా ప్రభుత్వం శతధా ప్రయత్నించింది. నిరసన శిబిరాల టెంట్లు పీకేయడం, మైకులు లాక్కోవడం, బెదిరించడం వంటి చర్యల ద్వారా పోలీసులు తీవ్ర ఆటంకాలు కల్పించారు. అయినా మొక్కవోని దీక్షతో వైఎస్సార్ సీపీ శ్రేణులు నిరసన దీక్షలు కొనసాగించారు. పల్నాడు జిల్లావ్యాప్తంగా రిలే నిరసన దీక్షలు విజయవంతంగా సాగాయి.


