డీఎస్సీ అక్రమాలపై గురజాలలో వైఎస్సార్ సీపీ నాయకులు గురువారం బ్రహ్మనాయుడు విగ్రహాం సెంటర్‌లో నిరాహారదీక్ష చేపట్టారు. దీక్ష కోసం టెంట్ వేసేందుకు ప్రయత్నాలు చేస్తుండగా పోలీసులు అత్యుత్సాహం చూపించారు. టెంట్ వేయకుండా అడ్డుకున్నారు. అనంతరం బ్రహ్మనాయుడు సెంటర్‌లో రోడ్డు పక్కనే నిరాహారదీక్షకు దిగారు. పోలీసులు అక్కడకు చేరుకుని దీక్ష చేసేందుకు అనుమతులు లేవని, ఇక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్లాలని బెదిరింపులకు దిగారు. అంతటితో ఆగకుండా దీక్షలో కుర్చున్న వైఎస్సార్ సీపీ నాయకులను బలవంతంగా అక్కడ నుంచి బయటకు పంపారు. గురజాల ఆర్డీఓకి వినతిపత్రం ఇచ్చేందుకు వెళతామని అడిగినా పోలీసులు అంగీకరించలేదు. దీక్ష చేస్తున్న వారి వివరాలను సేకరిస్తూనే డ్రోన్ కెమెరాతో వైఎస్సార్ సీపీ నేతలను చిత్రీకరించారు. అనంతరం వైఎస్సార్ సీపీ నాయకులు గురజాల పట్టణంలో ర్యాలీ చేసి కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు, లోకేష్‌లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.


