పల్నాడు | - | Sakshi
Sakshi News home page

పల్నాడు

Aug 4 2026 1:29 AM | Updated on Aug 4 2026 1:29 AM

మంగళవారం శ్రీ 4 శ్రీ ఆగస్టు శ్రీ 2026 గజిబిజి అక్షరాలతో మందుల చీటీలు నిమ్మకాయల ధరలు పులిచింతల సమాచారం సాగర్‌ నీటి మట్టం

న్యూస్‌రీల్‌

జాతీయ వైద్య కౌన్సిల్‌ చెప్పినా..

మంగళవారం శ్రీ 4 శ్రీ ఆగస్టు శ్రీ 2026
గజిబిజి అక్షరాలతో మందుల చీటీలు
వైద్యుల చేతి రాత రోగికి పెద్ద పరీక్షగా మారింది.. ఆసుపత్రిలో చికిత్స పూర్తయిన తర్వాతే అసలు కష్టాలు మొదలవుతున్నాయి. వైద్యుడు రాసిన గజిబిజీ చేతిరాత బయట మెడికల్‌ షాపుల సిబ్బందికి అర్థంకావటంలేదు. దీంతో ఒక మెడికల్‌ షాపు నుంచి మరో షాపునకు తిరుగుతూ చివరకు అధిక ధరలకు సదరు వైద్యుడికి అనుబంధంగా ఉన్న మెడికల్‌ షాపులోనే మందులు కొనాల్సి వస్తుంది. ఇది కేవలం చేతిరాత సమస్యే కాదు. రోగుల ప్రాణాలతో ముడిపడి ఉన్న అత్యంత తీవ్రమైన అంశం. జాతీయ వైద్య కమిషన్‌ పదేపదే చెబుతున్నా వైద్యుల తీరు మాత్రం మారటంలేదు.

7

తెనాలి: తెనాలి మార్కెట్‌యార్డులో సోమవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.4000, గరిష్ట ధర రూ.7600, మోడల్‌ ధర రూ.5400 వరకు పలికింది.

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 28.9183 టీఎంసీలు. విద్యుత్‌ ఉత్పత్తి నిమిత్తం ప్రాజెక్టు దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు.

మాచర్ల: నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నీటిమట్టం సోమవారం 513.10 అడుగులుగా ఉంది. తెలంగాణ లోని ఎస్‌ఎల్‌బీసీకి 900 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.

మందుల వివరాలను వైద్యులు స్పష్టంగా రాయాల్సిందేనని నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ ఇటీవల మరోసారి స్పష్టం చేసింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల వైద్య విద్య సంచాలకులతోపాటు అన్ని వైద్య కళాశాలల ప్రిన్సిపాళ్లు, డైరెక్టర్లకు మార్గదర్శకాలు జారీ చేశారు. ప్రతి బోధనాసుపత్రిలో తప్పనిసరిగా ‘డ్రగ్స్‌ థెరప్యూటిక్స్‌ కమిటీ’ (డీటీసీ) ఏర్పాటు చేసి తాము జారీ చేసిన ఆదేశాలు అమలయ్యేలా చూడాలని అందులో సూచించింది. వైద్యులు స్పష్టమైన చేతిరాతతో చీటీపై మందులు రాయాలని, ఈ మేరకు గత ఏడాది ఆగస్టులో పంజాబ్‌, హరియాణా హైకోర్టు తీర్పునిచ్చిన అంశాన్ని గుర్తు చేసింది. మందుల చీటీపై స్పష్టమైన రాత అన్నది రాజ్యాంగంలో ఆర్టికల్‌ 21కి లోబడి రైట్‌ టు హెల్త్‌ కిందకు వస్తుందని కోర్టు పేర్కొందని వివరించింది. ఎన్‌ఎంసీ, ఎంసీఐలు వైద్యుల చేతిరాత గురించి పదేపదే ఆదేశించినా కొందరు డాక్టర్లలో మార్పు రావడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement