వినుకొండ: వినుకొండ పట్టణంలోని తిమ్మాయపాలెం రోడ్డులోగల వై కన్వెన్షన్ హాల్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కారం ప్రజాదర్బార్ కార్యక్రమంలో ప్రజలు అర్జీలు సమర్పించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. పట్టణంలోని 30 పడకల ప్రభుత్వ వైద్యశాలలో గైనకాలజిస్ట్, సివిల్ సర్జన్ వైద్యులను కేటాయించాలని కోరుతూ సీపీఐ పట్టణ కమిటీ, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. అదేవిధంగా వినుకొండలో ప్రభుత్వ పీజీ, ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలలు ఏర్పాటు చేయాలని, నిరుద్యోగ యువతకు ఉపాధి కోసం పరిశ్రమను మంజూరు చేయాలని వారు కోరారు. పట్టణంలోని జామియా మసీదుకు చెందిన మసీదు మాన్యంలో అక్రమంగా నివాసం ఉంటున్న వారిని వెంటనే ఖాళీ చేయించాలని కలెక్టర్‌కు ముస్లిం మత పెద్దలు వినతిపత్రం అందజేశారు. అదేవిధంగా మసీదు మాన్యంలో నివాసం ఉంటున్న పలువురు తాము ఏళ్లుగా 2వేల మందికి పైగా అక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకుని ఉన్నామని విద్యుత్, తాగునీరు వంటి మౌలిక వసతులు కల్పించాలని వారు కోరారు. అదేవిధంగా వినుకొండ రూరల్ మండలం ఉప్పరపాలేనికి తాగునీటి వసతి కల్పించాలని గ్రామస్తులు కలెక్టర్‌ను కలిసి విన్నవించారు.
అర్జీలు స్వీకరించిన
జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా


