శ్రీశైలం నిండితే సాగర్‌కు నీటి విడుదల
అమరావతి: అమరావతిలోని అమరేశ్వరునికి సోమవారం శాస్త్రోక్తంగా సహస్ర ఘటాభిషేకం నిర్వహించారు. దేవదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆలయ కార్యనిర్వహణాధికారి సైదమ్మబాయ్ ఆధ్వర్యంలో అర్చకులు, వేదపండితులు సంకల్పం మహాన్యాసం, వరుణజపం, సూర్యనమస్కారాలు నిర్వహించారు. తొలుత ఆలయ స్థానాచార్యుడు కౌశిక చంద్రశేఖరశర్మ మహాన్యాసం నిర్వహించిన అనంతరం ఆలయ అర్చకులు, గ్రామంలోని బ్రాహ్మణులు పవిత్ర కృష్ణానది నుంచి ఊరేగింపుగా ఘటాలతో జలాలను తీసుకువచ్చి స్వామివారికి ప్రదక్షిణం నిర్వహించి అభిషేకించారు. అనంతరం రుత్విక్‌లు వరుణ జపాలు, సూర్యనమస్కారాలు చేయగా వేదపండితులు పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం ఒంటిగంటవరకు సహస్ర రుద్రాలతో స్వామివారికి కృష్ణ జలాలతో అభిషేకించిన అనంతరం అమరేశ్వరునికి ప్రత్యేక అలంకారం చేసి భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులకు ఉచిత ప్రసాదాలను పంపిణీ చేశారు. సహస్ర ఘటాభిషేకం కార్యక్రమంలో మండల పరిధి గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
డీఎంహెచ్‌వో చుక్కా రత్నమన్మోహన్
శావల్యాపురం: ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగి వివరాలను ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డులో తప్పనిసరిగా నమోదు చేయాలని జిల్లా వైద్యాదికారి చుక్కా రత్నమన్మోహన్ అన్నారు. సోమవారం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డీఎంహెచ్‌వో ఆకస్మికంగా సందర్శించారు. డీఎంహెచ్‌వో మాట్లాడుతూ ఆరోగ్య కేంద్రాల్లో కాన్పుల సంఖ్యను పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లోని ఆరోగ్యకర్తలు, ఆశలు గర్భిణులు కాన్పుల కోసం ప్రైవేటు వైద్యశాలకు వెళ్లకుండా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేస్తూ వారికి మరింత భరోసా కల్పించాలన్నారు. అనంతరం వైద్యశాలలోని లేబొరేటరీ, ఔషదాలు, పంపిణీ విభాగం, ప్రసూతి గది, ఆపరేషన్ థియేటర్, వార్డులు, కంప్యూటర్ విభాగం క్షుణ్ణంగా పరిశీలించారు. వైద్యశాల పరిసరాలు పరిశీలించి పనితీరును నిర్వహణ బాగుందుని ప్రశంసించారు. ఆయనతోపాటు డెప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టరు మురళీకృష్ణ, డీసీ ఆరోగ్యశ్రీ చంద్రశేఖర్, వైద్యాధికారులు మాణ్యం రాధాకృష్ణన్, రావిపూడి రమ్య, సూపర్‌వైజర్లు నారాయణమ్మ, ఏడుకొండలు, ఉమాదేవి, స్టాఫ్‌నర్సు ధనలక్ష్మి, ల్యాబ్ టెక్నీషియన్ సతీష్, ఫార్మాసిస్ట్ లక్ష్మీనారాయణఉన్నారు.
నూజండ్ల: చేపలు పట్టేందుకు వెళ్లి సమీపంలో విద్యుత్ తీగలు తగిలి బాలుడు మృతి చెందిన సంఘటన మండలంలోని కొత్త త్రిపురాపురంలో సోమవారం జరిగింది. ఐనవోలు పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన అమృతపూడి శాంసన్ కుమారుడు నీరజ్(17) తన బాబాయితో కలిసి సమీపంలోని గుండ్లకమ్మవాగులో చేపలు పట్టేందుకు వెళ్లాడు. చేపలు వేగంగా పట్టేందుకు నీటి గుంతల్లో విద్యుత్ తీగలు వేస్తారు. విద్యుత్ తీగలు గమనించని బాలుడు నీటిలో దిగటంతో షాక్‌కు గురయ్యాడు. ఇది గమనించిన సమీపంలోని వారు ప్రాథమిక చికిత్స అందించారు. అయినా ఫలితం లేక నీరజ్ మృతి చెందాడు. శాంసన్‌కు ఇరువురు సంతానం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఐనవోలు ఎస్సై కృష్ణారావు అన్నారు.


