కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య

Aug 4 2026 1:29 AM | Updated on Aug 4 2026 1:29 AM

కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య నిందితులకు రిమాండ్‌ అప్పుల బాధతో రైతు ఆత్మహత్య కాల్వలో ట్రాక్టర్‌ బోల్తా పడి ఒకరి మృతి కాకుమాను: పొలం పనులు ముగించుకుని ఇంటి బాట పట్టిన రైతుకూలీని విధి వక్రించింది. ట్రాక్టర్‌ టైర్లు జారిపోవడంతో వాహనం కాల్వలో బోల్తా పడి, ట్రాక్టర్‌ కింద చిక్కుకున్న రైతు కూలీ అక్కడికక్కడే మృతి చెందిన విషాద ఘటన కాకుమాను మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. రేటూరు గ్రామానికి చెందిన ఉప్పిరెట్ల రాజేంద్రప్రసాద్‌ ఆదివారం మధ్యాహ్నం తన సొంత పొలంలో వ్యవసాయ పనులు పూర్తిచేసి ట్రాక్టర్‌లో తిరిగి వస్తున్నారు. జమ్ములపాలెం బ్రిడ్జి సమీపంలో పొలం నుంచి ప్రధాన రహదారిపైకి ఎక్కే సమయంలో ట్రాక్టర్‌ టైర్లు జారిపోవడంతో వాహనం అదుపుతప్పి పక్కనే ఉన్న కాల్వలో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్‌ కింద బురదలో చిక్కుకున్న రాజేంద్రప్రసాద్‌ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య వెంకాయమ్మ ఫిర్యాదు మేరకు కాకుమాను పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో రేటూరు గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. సంగీతం శ్రద్ధగా సాధన చేయాలి

రాజుపాలెం: కుటుంబాల కలహాల నేపథ్యంలో భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాజుపాలెంలోని పులిచింతల నిర్వాసిత కేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కొంత కాలం నుంచి భార్యాభర్తలు ఇరువురి మధ్య గొడవులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మనస్తాపానికి గురైన నూన్సావత్‌ పవన్‌కుమార్‌నాయక్‌(32) ఇంటిలో పెట్రోలు పోసుకుని నిప్పుఅంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ సమయంలో భార్య సంధ్య ఇంటి వెనుక వైపు ఉండి కేకలు వేయడంతో చుట్టుప్రక్కల యువకులు తలుపు పగులగొట్టి చూడగా అప్పటికే శరీరం పూర్తిగా కాలిపోయి తీవ్ర గాయాలతో పడిఉన్నాడు. 108 సహాయంతో సత్తెనపల్లి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రథమ చికిత్స చేసిన అనంతరం మెరుగైన చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి ఐదేళ్లు, రెండేళ్ల బాలురు ఉన్నారు.

మాచర్ల: విజయపురిసౌత్‌ గ్రామంలో ఐదురోజుల కిందట దేచవరపు క్యాంపు తండాలో పాతకక్షల నేపథ్యంలో ఇరువర్గాలు ఘర్షణ పడ్డాయి. పోలీసులు రామచంద్రనాయక్‌, అతని కుటుంబ సభ్యులు దాడికి పాల్పడ్డారంటూ అరెస్టుచేసి సోమవారం సివిల్‌ అదనపు జూనియర్‌ న్యాయమూర్తి కోర్టులో హాజరుపర్చారు. న్యాయమూర్తి రిమాండ్‌ విధించారు.

మాచర్ల రూరల్‌: మాచర్ల మండలం కంభంపాడు గ్రామానికి చెందిన రైతు కొరట రాజశేఖర్‌ (27) పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల సమాచారం మేరకు, సాగు చేసిన మొక్కజొన్న పంట ఆశించిన స్థాయిలో దిగుబడి ఇవ్వకపోవడం, అమ్మిన పంట డబ్బులు ఇంతవరకు రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర మనస్తాపానికి గురైన రాజశేఖర్‌ పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మూడు రోజుల కిందటే పురుగుమందు తాగిన రాజశేఖర్‌ను కుటుంబ సభ్యులు వెంటనే మాచర్ల ఆసుపత్రికి, ఆ తరువాత గుంటూరు హాస్పిటల్‌ కు తరలించినప్పటికీ చికిత్స పొందుతూ మృతి చెందాడు. రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ప్రముఖ గాయని ఎస్పీ శైలజ

ఏఎన్‌యూ (పెదకాకాని): సంగీతం శ్రద్ధగా నేర్చుకుని సాధన చేయడం ద్వారా సంగీత రంగంలో రాణించవచ్చని ప్రముఖ గాయని డాక్టర్‌ ఎస్పీ శైలజ అన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా సోమవారం డాక్టర్‌ శైలజ దంపతులు విచ్ఛేశారు. తొలుత జ్యోతి ప్రజ్వలన, ప్రముఖ గాయకుడు, నటుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. శైలజ మాట్లాడుతూ సంగీతంనపై ఆసక్తి ఉంటే సాధన ద్వారా ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చన్నారు. వీసీ కె.గంగాధరరావు మాట్లాడుతూ సంగీతం, పాటలు ఒత్తిడిని దూరం చేస్తాయన్నారు. కార్యక్రమంలో సినీనటుడు సుధాకర్‌ తదితరులుపాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement