నరసరావుపేట: జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య, ప్రముఖ రంగస్థల కళాకారుడు బళ్లారి రాఘవ చిరస్మరణీయులని జిల్లా అధికారులు పేర్కొన్నారు. వారి జయంతిని పురస్కరించుకొని కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా రవాణా అధికారి జి.సంజీవ్‌కుమార్, పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీనివాసరావు, జిల్లా పర్యాటక శాఖ అధికారి గంగినేని నాయుడమ్మ మాట్లాడుతూ దేశానికి విశిష్ట సేవలు అందించిన మహనీయులను వారిని స్మరించుకోవడం స్ఫూర్తిదాయకం అన్నారు. కళారంగంలో బళ్లారి రాఘవ తమ నటనా వైభవంతో బ్రిటీష్ ప్రభుత్వ ప్రశంసలు పొందారని, అలాగే జాతీయ పతాకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్య దేశానికి చిరస్మరణీయమైన సేవ చేసిన మహనీయుడని కొనియాడారు. కలెక్టర్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.


