సెంట్రల్‌ డివైడర్‌ స్తంభాన్ని ఢీకొన్న లారీ | - | Sakshi
Sakshi News home page

సెంట్రల్‌ డివైడర్‌ స్తంభాన్ని ఢీకొన్న లారీ

Aug 2 2026 1:46 AM | Updated on Aug 2 2026 1:46 AM

విరిగి విద్యుత్‌లైన్‌పై పడిన స్తంభం వెంటనే విద్యుత్‌ సరఫరా నిలిచిపోవటంతో తప్పిన ప్రమాదం

నరసరావుపేట: స్థానిక వినుకొండరోడ్డులోని ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలో శనివారం పెను ప్రమాదం తప్పింది. ఆ మార్గంలోని మాతాశ్రీ హాస్పిటల్‌కు ఎదురుగా ఉన్న రోడ్డు మధ్యలో ఏర్పాటుచేసిన వీధిలైట్ల స్తంభాన్ని ఓ లారీ ఢీకొట్టింది. దీంతో పోల్‌ దిమ్మె విరిగి పోల్‌ వంగి రెండోవైపున ఉన్న విద్యుత్‌లైన్‌పై పడింది. దీంతో వెంటనే వైర్లు ఒకదానితో ఒకటి కలిసి నిప్పరవ్వలు, మంటలు వ్యాపించి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. ఆ మార్గంలో బస్టాండ్‌ నుంచి బస్సులు, బస్టాండ్‌ ముందు నుంచి వినుకొండవైపుకు ప్రయాణీకులతో ఆటోలు ప్రయాణిస్తుంటాయి. అదే స్థంభం పూర్తిగా ఒరిగి వాటిపై పడినా ప్రయాణీకులకు గాయాలు తగిలేవి. సమాచారం రాగానే వెంటనే స్పందించి పోల్‌ను అక్కడిని తొలగించామని మున్సిపల్‌ డీఈ మహమద్‌ రఫీక్‌ వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement