ఉపాధ్యాయులకు టెట్‌ సైకాలజీపై శిక్షణ | - | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయులకు టెట్‌ సైకాలజీపై శిక్షణ

Jul 12 2026 3:11 AM | Updated on Jul 12 2026 3:11 AM

గుంటూరు ఎడ్యుకేషన్‌: ఎస్టీయూ గుంటూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో శనివారం కొత్తపేటలోని మల్లయ్య లింగం భవన్‌లో ఇన్‌ సర్వీసు ఉపాధ్యాయులకు టెట్‌ పరీక్షలో భాగంగా సైకాలజీ తరగతులు నిర్వహించారు. ప్రముఖ సైకాలజీ నిపుణుడు టి.సుగంధరావు సైకాలజీ తరగతులను బోధించారు. కార్యక్రమానికి ఎస్టీయూ గుంటూరు జిల్లా అధ్యక్షుడు షేక్‌ బాజీ అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఏఐఎస్టీఎఫ్‌ జాతీయ ఆర్థిక కార్యదర్శి సిహెచ్‌.జోసెఫ్‌ సుధీర్‌ బాబు మాట్లాడుతూ టెట్‌ ఉత్తీర్ణతపై ఉపాధ్యాయులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయులు టెట్‌ ఉత్తీర్ణత నుంచి మినహాయింపు పొందటానికి ఎస్టీయూ అన్ని రకాలుగా కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడు డి.పెదబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని పార్లమెంటులో చట్టం చేయించి 2011 ముందు ఉపాధ్యాయ ఉద్యోగంలో చేరిన వారికి టెట్‌ ఉత్తీర్ణత నుంచి మినహాయింపు లభించేలా చట్టం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కాకుమాను జోజప్ప, రాష్ట్ర కార్యదర్శి ఎం.శ్రీధర్‌, మాజీ రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షులు ఎస్‌.రామచంద్రయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి వై.శ్యామ్‌ బాబు, జిల్లా ఆర్థిక కార్యదర్శి హనుమంత ప్రసాద్‌, జిల్లా గౌరవాధ్యక్షులు ఏవీ ప్రసాద్‌ బాబు, నాయకులు వీరాంజనేయులు, మహి, శంకర్‌, ఏ వీరయ్య, భానుమూర్తి, ఏడుకొండలు, వెంకయ్య, గురుబ్రహ్మం, దేవరాజ్‌ పి.రవికుమార్‌, బి.మరియదాసు, జగన్‌, పి.సురేష్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement