టీడీపీ నేత కార్యాలయంలో హత్యాయత్నం | - | Sakshi
Sakshi News home page

టీడీపీ నేత కార్యాలయంలో హత్యాయత్నం

Jul 11 2026 7:01 AM | Updated on Jul 11 2026 7:01 AM

టీడీపీ నేత కార్యాలయంలో హత్యాయత్నం

పట్నంబజారు(గుంటూరు ఈస్ట్‌): టీడీపీ నేత ముజీబ్‌ కార్యాలయంలో జరిగిన కుటుంబ పంచాయి తీ నేపథ్యంలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. బావ తమ్ముడిపై కత్తితో దాడికి పాల్పడిన ఘటన శుక్రవారం జరిగింది. పాతగుంటూరు సుద్దపల్లి డొంకకు చెందిన షేక్‌ షాజిదబేగంను నాలుగేళ్ల కిందట కృష్ణా జిల్లా ఉయ్యూరు గ్రామానికి చెందిన షేక్‌ రఫీకి ఇచ్చి వివాహం జరిపారు. రెండున్నరేళ్ల కిందట భార్యా భర్తల మధ్య మనస్పర్థలు రావడంతో దిశ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయ గా, అప్పటి పోలీసులు ఇరువర్గాలకు సర్ది చెప్పి కాపురానికి పంపించారు. మళ్లీ ఏడాది క్రితం ఇరువురి మధ్య వివాదం జరగడంతో మహిళా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదుచేయగా, కేసు నమో దై ప్రస్తుతం కోర్టులో ఉంది. షేక్‌ రఫీ బంధువు బాజి ముజీబ్‌ను సంప్రదించి తమ సమస్యను పరిష్కరించాలని కోరడంతో షాజిద కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా, శుక్రవారం ఆర్టీసీ బస్టాండ్‌ ఎదురుగా ఉన్న ఆయన కా ర్యాలయంలో పంచాయితీ జరిగింది. షాజిదా తమ్ముడు షౌకత్‌ అలి అతనితోపాటు మరో ఇద్దరు కలిసి రఫీ తమ్ము డు ఇమ్రాన్‌పై కత్తితో దాడిచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement