నరసరావుపేట: జిల్లాలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియ ముగింపునకు మరో మూడురోజులు మిగిలి ఉండగా శనివారం నాటికి ఓటరు ఎన్యూమరేషన్‌ఫారాల డిజిటలైజేషన్ 81.89 శాతం పూర్తి చేశారు. మొత్తం ఓటర్లు 17,41,798 మంది ఉండగా.. వందశాతం మందికి ఫారాలు పంపిణీ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ కృతికాశుక్లా పేర్కొన్నారు. వీరిలో 14,26,416 మంది ఫారాలు డిజిటలైజేషన్ చేశామన్నారు.
సర్ ప్రక్రియ పరిశీలన
రొంపిచర్ల: మండలంలోని అన్నవరం, రొంపిచర్ల గ్రామాల్లో ఆర్డీఓ కె. బాలకృష్ణ శనివారం పర్యటించారు. సర్ కార్యక్రమాన్ని పరిశీలించారు. రొంపిచర్లలోని 33, 34, 35, 36, 37, 38 పోలింగ్ బూత్‌ల పరిధిలో ప్రక్రియ తీరును తెలుసుకున్నారు. బీఎల్‌ఓలతో మాట్లాడి, పలు సూచనలు ఇచ్చారు. అన్నవరం గ్రామంలోని 63, 64 పోలింగ్ బూత్‌ల పరిధిలో కూడా పరిశీలించారు. పారదర్శకంగా మ్యాపింగ్ చేయాలని బీఎల్‌ఓలను ఆదేశించారు. తహసీల్దార్ బండి నిర్మల తదితరులు వెంట ఉన్నారు.


