వ్యాధి బాధితులకు నేడు డీప్ బ్రెయిన్ స్టిమ్యూలేషన్ (డీబీఎస్) అనే అత్యాధునిక ఆపరేషన్లు అందుబాటులో ఉన్నాయి. డీబీఎస్ ఆపరేషన్లు పార్కిన్సన్స్ వ్యాధి బాధితులకు వరం వంటివి. గతంలో ఆపరేషన్లు లేకపోవటంతో జీవితాంతం ఎక్కువ మొత్తంలో మందులు మింగాల్సి వచ్చేది. ఈ ఆపరేషన్లు చేయటం ద్వారా బాధితుడు సాధ్యమైనంత మేరకు మందులు తగ్గించి వేయవచ్చు. తన పనులు తాను కొంత మేరకు చేసుకునే సౌలభ్యం కలుగుతుంది.
– డాక్టర్ భవనం హనుమ శ్రీనివాసరెడ్డి,
సీనియర్ న్యూరో సర్జన్, గుంటూరు


