ఇద్దరు మహిళలు అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

ఇద్దరు మహిళలు అరెస్ట్‌

Mar 4 2026 7:44 AM | Updated on Mar 4 2026 7:44 AM

● యువకుడు మృతి

నరసరావుపేట టౌన్‌/నకరికల్లు: అక్రమంగా నాటుసారా కలిగి ఉన్న ఇద్దరు మహిళలను అరెస్ట్‌ చేసినట్లు ఎకై ్సజ్‌ సీఐ సోమయ్య మంగళవారం తెలిపారు. నకరికల్లు మండలం చేజర్ల గ్రామంలో నాటు సారా తయారు చేస్తున్నారనే సమాచారంతో దాడులు నిర్వహించామన్నారు. అక్కడ ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి నాలుగు లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకున్నామన్నారు.

కార్ల ధ్వంసం కేసులో నిందితుడికి రిమాండ్‌

మంగళగిరి టౌన్‌ : ఫిబ్రవరి 27వ తేదీన మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలోకి చొరబడి రెండు కార్లను ధ్వంసం చేయడంతో పాటు భద్రతా సిబ్బందిపై దాడిచేసిన వ్యక్తిని మంగళవారం రిమాండ్‌కు పంపినట్లు మంగళగిరి పట్టణ పోలీసులు తెలిపారు. పార్టీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందిపై దాడి చేసి ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసినట్లు పార్టీ కార్యాలయ భద్రతా సిబ్బంది రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్‌ పెంటారావు ఫిర్యాదు మేరకు శ్రీకాకుళం జిల్లాకు చెందిన నీలాద్రిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిందితుడిని అరెస్ట్‌ చేసి మంగళగిరి కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి నీలాద్రికి 14 రోజులు రిమాండ్‌ విధించారని తెలిపారు.

రేషన్‌ బియ్యం స్వాధీనం

తెనాలిరూరల్‌: అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని ఆటోను సీజ్‌ చేశారు. వన్‌ టౌన్‌ సర్కిల్‌ పరిధిలో బియ్యాన్ని తరలిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు మంగళవారం తెల్లవారుజామున తనిఖీలు నిర్వహించారు. ఆటోలో తరలిస్తున్న ఏడు బస్తాల(50 కిలోల చొప్పున) రేషన్‌బియ్యాన్ని స్వాధీనం చేసుకుని ఆటోను స్టేషన్‌కు తరలించారు. డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు.

కూలీల ఆటో బోల్తా

ఒకరు మృతి..నలుగురికి గాయాలు

తాడికొండ: కూలీలతో వెళుతున్న ఆటో అదుపుతప్పి దుగ్గిరాల కాల్వలోకి దూసుకెళ్ళడంతో పనులకు వెళుతున్న ముఠా మేసీ్త్ర మృతి చెందడంతో పాటు నలుగురికి గాయాలైన ఘటన తుళ్ళూరు మండలం పెదపరిమి గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దుగ్గిరాల నుంచి కూలీ పనుల నిమిత్తం ఆటోలో మహిళలు తెల్లవారుజామున పెదపరిమి గ్రామానికి వస్తుండగా రోడ్డు మార్జిన్‌లో ఆటో జారి పక్కనే ఉన్న కాల్వలోకి దూసుకెళ్లడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో కూలీలను తీసుకొని వెళుతున్న ముఠా మేసీ్త్ర వేమినేని వెంకటేశ్వరమ్మ(50) ఘటనా స్థలంలోనే మరణించగా డ్రైవర్‌తో సహా నలుగురికి గాయాలు కావడంతో ఆటోలో ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తుళ్ళూరు పోలీసులు తెలిపారు.

శివాలయం తలుపులు మూసివేత

పెదకాకాని: చంద్ర గ్రహణం సందర్భంగా మంగళవారం పెదకాకాని శివాలయం తలుపులు మూసివేశారు. గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి దేవస్థానంలో ఉదయం 9 గంటల వరకు పూజా కార్యక్రమాలు అభిషేకాలు యతఆవిధిగా కొనసాగాయి. అనంతరం ఆలయ తలుపులకు తాళాలు వేశారు. బుధవారం ఆలయ శుద్ధి, సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు ఉదయం 7 గంటల నుంఛఇ దర్శనం ఇతర అన్ని రకాల ఆర్జిత సేవలకు అనుమతించడం జరుగుతుందని ఆలయ డిప్యూటీ కమిషనర్‌ గోగినేని లీలా కుమార్‌ తెలిపారు.

ఆటోను ఢీకొట్టిన లారీ

ఇంకొల్లు(చినగంజాం): ఆటోను లారీ ఢీ కొన్న ఘటనలో ఒక యువకుడు మృతి చెందాడు. ఘటన ఇంకొల్లు మండలంలోని దుద్దుకూరు గ్రామ సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన 8 మంది వ్యవసాయ కూలీలు దుద్దుకూరు ఉత్తరపు పొలాల్లో శనగ కోసే పనులు పూర్తి చేసుకొని ఒకే ఆటోలో ఇంటికి తిరిగి వస్తున్నారు. ఆ సమయంలో వారికి సమాంతరంగా వస్తున్న సిమెంట్‌ లోడు లారీ ఆటోను కుడివైపున బలంగా ఢీ కొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఆటోలో కుడివైపును కూర్చొన్న ఇరువురు దునిమిద్దుల తిమోతి (25), గుంటూరు గౌరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలపాలైన వారిని దుద్దుకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రథమ చికిత్స నిర్వహించి మెరుగైన చికిత్స నిమిత్తం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. గాయాలపాలైన వారిలో తిమోతికి అతనికి ఎడమ వైపున మెడ వద్ద పుట్టుకతో వచ్చిన గడ్డ పగలడంతో తీవ్ర రక్తస్రావమై చికిత్స పొందుతూ మృతి చెందాడు. గుంటూరు గౌరి కుడి కాలు, కుడి చేయి విరిగింది. ప్రమాదస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ జీ సురేష్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement