● ఏపీటీఎఫ్ డిమాండ్
● ఢిల్లీలో ఈనెల 10న ధర్నా
● చలో ఢిల్లీ పోస్టర్ విడుదల ● ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కెఎస్‌కె ఫరీఫా అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మక్కెన శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు రానున్న రెండు సంవత్సరాలలో టెట్ ఉత్తీర్ణత సాధించలేకపోతే ప్రమోషన్ ఉండదు.. సర్వీస్ నుంచి తొలగించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. అయితే తీర్పు రావటానికి కారణమైన విద్యాహక్కు చట్టాన్ని సవరించాలన్నారు. పెరిగిన జనాభాకు అనుగుణంగా నూతనంగా ఏర్పడిన కాలనీలలో పాఠశాలలు ఏర్పాటు చేయాలని, పాత పెన్షన్ విధానాన్ని తిరిగి అమలు చేయాలని కోరారు.
● జిల్లా ప్రధాన కార్యదర్శి బాళ్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ, డిఎస్సీ– 2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని వర్తింప చేయాలని, 12వ పీఆర్‌సీ కమిషన్ నియమించి 30 మధ్యంతర భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
● రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సయ్యద్ కరిముల్లా మాట్లాడుతూ, యాప్‌ల భారం తగ్గించాలనీ, మున్సిపల్ ఉపాధ్యాయులకు పీఎఫ్ సౌకర్యం కల్పించాలని కోరారు.
నరసరావుపేట ఈస్ట్: ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వారికి టెట్ ఉత్తీర్ణత నిబంధన నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీటీఎఫ్) నాయకులు డిమాండ్ చేశారు. టెట్ విధానం రాకముందు ఎంపికై న ఉపాధ్యాయులను మినహాయించాలని కోరారు. టెట్ నిబంధన తొలగించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 10వ తేదీన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టిన ధర్నాను జయప్రదం చేయాలని కోరారు. ఈమేరకు ఛలో ఢిల్లీ వాల్‌పోస్టర్‌ను మంగళవారం ఏపీటీఎఫ్ కార్యాలయంలో ఆవిష్కరించారు.
సమావేశంలో ఏపీటీఎఫ్ నేతలు కృష్ణారావు, ఇబ్రహీం, దమ్మాటి శ్రీనివాసరావు, ప్రజామూర్తి తదితరులు పాల్గొన్నారు.