కేఎల్‌యూకు పురస్కారాలు
తాడేపల్లి రూరల్ :వడ్డేశ్వరం కేఎల్ యూనివర్సిటీకి గ్రీన్ ఉర్జా మరియు ఎనర్జీ ఎఫిషియెన్సీ గోల్డ్ అవార్డులు వచ్చాయని వర్సిటీ వైస్ ప్రెసిడెంట్ కోనేరు లక్ష్మణ్ హవీష్ గురువారం పేర్కొన్నారు. ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్, నూతన మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ, డెలాయిట్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన 6వ గ్రీన్ ఉర్జా మరియు ఎనర్జీ ఎఫిషియెన్సీ అవార్డ్స్ కార్యక్రమంలో ఢిల్లీలో ఈ నెల 4వ తేదీన ఈ అవార్డులు ప్రదానం చేశారని పేర్కొన్నారు. రిజిస్ట్రార్ డాక్టర్ కె. సుబ్బారావు వీటిని స్వీకరించారని తెలిపారు.


