రేపు 9, 11వ తరగతి నవోదయ ప్రవేశ పరీక్ష
నిర్వహణకు కేంద్రాల ఏర్పాటు సిద్ధం
చిలకలూరిపేటటౌన్: నవోదయ విద్యాలయంలో 9, 11వ తరగతి ప్రవేశ పరీక్ష శనివారం నిర్వహిస్తున్నట్లు మద్దిరాల జేఎన్‌వీ ప్రిన్సిపాల్ నల్లూరి నరసింహారావు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నవోదయ విద్యాలయ సమితి నిర్వహించే ఈ పరీక్షలకు ఉమ్మడి గుంటూరు జిల్లాల పరిధిలో 2031 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. వీరిలో 9వ తరగతికి 838 మంది, 11వ తరగతికి 1193 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఆయా పరీక్షల నిర్వహణకు కేంద్రాల ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేసినట్లు వివరించారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు ఉదయం 10 గంటలకంటే ముందే చేరుకోవడానికి తగిన ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు. హాజరయ్యే విద్యార్థులు తమ వెంట అడ్మిట్ కార్డు, ఆధార్ కార్డు తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు. ఈ రెండూ లేనిదే పరీక్ష రాయడానికి అనుమతి ఉండదన్న విషయాన్ని అభ్యర్థులు, తల్లిదండ్రులు గ్రహించాలన్నారు. అడ్మిట్‌కార్డులో పొందు పరిచిన పరీక్ష కేంద్రం పేరు, చిరునామా, తేదీ, సమయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు సరి చూసుకోవాలని తెలిపారు. అడ్మిట్ కార్డును ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవడంలో ఏవైన ఇబ్బందులు, సందేహాలు ఉంటే నవోదయ ప్రిన్సిపాల్ సెల్ 9014307677, 9494676751 నంబర్లలో సంప్రదించ వచ్చన్నారు.
కొరిటెపాడు(గుంటూరు): కారు డ్రైవింగ్, కంప్యూటర్ ట్యాలీ కోర్స్‌ల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డైరెక్టర్ టి.సందీప్ బాబు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మార్చి 2వ తేదీ నుంచి కారు డ్రైవింగ్, 9వ తేదీ నుంచి ట్యాలీ కోర్స్‌లో శిక్షణ ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు. గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతులు, మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. వివరాలకు 0863 – 2336912, 97006 87696, 81253 97953, 99499 30155, 97034 05066 ఫోన్ నంబర్లను సంప్రదించాలని ఆయన తెలిపారు.


