పల్నాడు | - | Sakshi
Sakshi News home page

పల్నాడు

Nov 21 2025 7:09 AM | Updated on Nov 21 2025 7:09 AM

పల్నా

పల్నాడు

శుక్రవారం శ్రీ 21 శ్రీ నవంబర్‌ శ్రీ 2025 నరేంద్రస్వామికి ప్రత్యేక పూజలు స్పర్శలేని మచ్చలను గుర్తించాలి తక్కువ ధరకు బంగారం అంటూ దగా రణక్షేత్రంలో కొలువుదీరిన అలనాటి ఆయుధాలు

న్యూస్‌రీల్‌

రూ.9 లక్షలు తీసుకొని నకిలీ బంగారం అప్పగింత బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు నిందితుల కోసం టూటౌన్‌ పోలీసులు గాలింపు

ఏళ్ల తరబడి వరద కష్టాలు.. భారీ వర్షాల సమయంలో యడ్లపాడు మండలం అతలాకుతలం ఉగ్రరూపం దాల్చే నక్కవాగు, ఉప్పవాగులతో ప్రజలు బెంబేలు పొలాలను ముంచుతూ, రాకపోకలను స్తంభింపజేస్తూ.. గ్రామాల మధ్య సంబంధాలను తెంపేస్తున్న కాజ్‌వేలు, లోలెవల్‌ చప్టాలు ఏటా జలగండంతో పంటలు నష్టపోతున్న రైతాంగం సమస్యకు శాశ్వత పరిష్కారం కోరుతున్న ప్రజానీకం

లోలెవల్‌ చప్టాలతోనూ ఇక్కట్లు ...

శుక్రవారం శ్రీ 21 శ్రీ నవంబర్‌ శ్రీ 2025

7

పెదపులివర్రు(భట్టిప్రోలు): పెదపులివర్రులోని బాలా త్రిపురసుందరి సమేత రాజరాజ నరేంద్రస్వామి ఆలయంలో కార్తికమాసం చివరిరోజు గురువారం ప్రాతఃకాలంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఫిరంగిపురం: ఫిరంగిపురంలో కుష్ఠు వ్యాధిపై చేస్తున్న సర్వే తీరును గురువారం స్టేట్‌ సర్వేలెన్స్‌, ఇన్‌చార్జి లెప్రసీ జేడీ డాక్టర్‌ ఉషారాణి పరిశీలించారు. స్వర్శ లేని మచ్చలను గుర్తించాలన్నారు.

నరసరావుపేట టౌన్‌: తక్కువ ధరకు బంగారం విక్రయిస్తానని నమ్మబలికి నకిలీ బంగారం ఇచ్చి మోసం చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. రూ.9 లక్షలు ఇచ్చి మోసపోయినట్లు బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో గురువారం టూటౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సాయినగర్‌ మొదటి వీధిలో కాకుమాను అయ్యప్ప నివాసం ఉంటున్నాడు. పది రోజుల కిందట అయ్యప్ప తాత కృష్ణమూర్తికు అజ్ఞాత వ్యక్తి ఫోన్‌ చేసి పరిచయం చేసుకున్నాడు. తాను కేరళలో జేసీబీతో కొండ ప్రాంతంలో పనిచేస్తుండగా బంగారం దొరికిందని దాన్ని తక్కువ ధరకు ఇస్తానని నమ్మబలికాడు. నాలుగు రోజుల కిందట నరసరావుపేటకు వచ్చి రెండు బంగారపు చిన్న గుండ్లు ఇచ్చి టెస్ట్‌ చేయించుకోవాలని చెప్పాడు. వాటిని కృష్ణమూర్తి టెస్ట్‌ చేయించగా బంగారం అని తేలింది. దీంతో అతని మాటలు నమ్మారు. రూ.9 లక్షలకు మూడు కేజీల బంగారం ఇస్తానని చెప్పటంతో ఈనెల 12వ తేదీ కృష్ణమూర్తి అతని మనవడు అయ్యప్ప ఇద్దరూ వెళ్లారు. బెంగళూరుకు 15 కిలోమీటర్ల దూరంలో బస్సు దిగమన్నాడు. అతను చెప్పిన ప్రదేశంలో బస్సు దిగిన తర్వాత ఇద్దరు అజ్ఞాత వ్యక్తులు వచ్చి మూడు కిలోలు ఉన్న బంగారం పూత ఉన్న ముద్దను ఇచ్చి రూ.9 లక్షల నగదు తీసుకొని వెళ్లారు. దాన్ని నరసరావుపేటకు తీసుకొచ్చి పరీక్ష చేయించగా నకిలీది అని తేలింది. మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ప్రభాకర్‌ తెలిపారు.

యడ్లపాడు: వర్షం కురవడం ప్రతి జీవికి హర్షం. పంటలకై తే ప్రాణం. అదే వర్షం అధికమైతే యడ్లపాడు మండల ప్రజలకు అది జీవన్మరణ పోరాటంగా మారుతోంది. ఓ మోస్తరు వర్షం కురిస్తే చాలు..యడ్లపాడు మండలంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తప్పవు. నక్క వాగు, ఉప్పవాగులు ఉగ్రరూపం దాల్చి, పంట పొలాలను ముంచి, ప్రజల రాకపోకలను పూర్తిగా నిలిపివేస్తున్నాయి. ఏళ్ల తరబడి ఈ వరద కష్టాలకు శాశ్వత పరిష్కారం కరువైంది. యడ్లపాడు మండలంలో ప్రధానంగా నక్కవాగు పలు గ్రామాల గుండా ప్రవహిస్తుంది. వాగుకు కొన్ని చోట్ల కరకట్టలు లేకపోవడం, మరి కొన్నిచోట్ల గండ్లు పడటంతో వర్షం వచ్చిన ప్రతి సారీ వాగు పొంగిపొర్లుతోంది. ఎగువ నుంచి వచ్చే నీరు, కొండవీడు కొండలపై కురిసిన నీరు సైతం కొండవాగు రూపంలో వచ్చి చేరడంతో నక్కవాగు, దాని చీలిక అయిన ఉప్పవాగు భారీ ప్రవాహాన్ని సృష్టిస్తున్నాయి. వీటి వల్ల కాజ్‌వేలు, లోలెవల్‌ చప్టాలపై నుంచి నీరు ప్రవహిస్తూ పలు గ్రామాల మధ్య సంబంధాలను తెంచేస్తున్నాయి.

నీటి మునుగుతున్న పంటలు..

మోంథా తుఫాన్‌ కారణంగా పలు రకాల పంటలు నీట మునిగి రైతులు పూర్తిగా నష్టపోగా, జల దిగ్భందంతో పలు గ్రామాల్లో రాకపోకలు స్తంభించాయి. కరకట్టల ను తెంచుకుని దూసుకొచ్చే ఈ వరద నీరు వందలాది పంటల్ని ముంచెత్తుతోంది. చెంఘీజ్‌ఖాన్‌పేట, సొలస, లింగారావుపాలెం, మైదవో లు, యడ్లపాడు, కారుచోల, గుత్తావారిపాలెంతోపాటు లోతట్టు ప్రాంతాలైన తిమ్మాపురం, దింతెనపాడు, జగ్గాపురం, జాలాది, సందెపూడి, గణేశుని వారిపాలెం, తుర్లపాడులో వెల్లువపడి నీరుతప్ప మరేమీ కనిపించని పరిస్థితి. ఏటా ఇలా జలగండంతో పంటలు నష్టపోయిరైతులు అప్పుల్లోకూరుకుపోతున్నారు.

వాగుల వల్ల ఇబ్బందులు..

నక్కవాగు తొలిగా సొలస వద్ద ఉన్న లోలెవల్‌ కాజ్‌వే పైగుండా ప్రవహిస్తుంది. గ్రామానికి రాకపోకలు నిలిచిపోతాయి. వాగు వెంబడి ఉన్న పంటపొలాలు నీట మునుగుతాయి. లింగారావుపాలెం గ్రామంలో పడమరవాగు ఒకవైపు, నక్కవాగు మరోవైపు ఊరిని చుట్టుముడతాయి. భారీ వర్షం కురిస్తే ఈ గ్రామంలోనూ రాకపోకలు స్తంభిస్తాయి. ఆ తర్వాత నక్కవాగు రెండు పాయలుగా చీలి ఒకటి తిమ్మాపురం, మరోకటి యడ్లపాడు వైపు ప్రవహిస్తాయి. మైదవోలు వద్ద నుంచి చీలే రెండోపాయనే ఉప్పవాగు అని పిలుస్తారు. తిరిగి ఈ రెండు పాయలు జగ్గాపురం గ్రామ శివారులో ఒక్కటవుతాయి. ఇక్కడే పలు రకాల కొండవాగులు కూడా వచ్చి ఈ వాగులో చేరతాయి. అసలే లోతట్టు ఆపై నలుదిక్కుల నుంచి వచ్చే నీటితో దిగువ ప్రాంతాలు, పంటపొలాలు అతలాకుతలమవుతాయి.

సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమం తప్పదు

మైదవోలులోని రామాలయం సమీపంలో, కారుచోల చెరువు పక్కనే ఉన్న రెండు చప్టాలు, కారుచోల–జాలాది మార్గంలోని చప్టా, జాలాది సచివాలయాల సమీపంలోని రెండు చప్టాలు, జాలాది–గణేశునివారిపాలెం మార్గంలోని నాలు గు చప్టాలు, జాలాది–వేలూరు, తుర్లపాడు–కొప్పర్రు మార్గాల్లో లోలెవల్‌ చప్టాలు ఉన్నాయి. అధిక వర్షాలు కురిస్తే చాలు ఆయా చప్టాలపై నుంచి నీరు వేగంగా ప్రవహిస్తూ ఆయా గ్రామాల మధ్య సంబంధాలను తెంచేస్తాయి. రాకపోకలు పూర్తిగా నిలిచిపోతాయి. సొలస వద్ద ఉన్న లోలెవల్‌ కాజ్‌వేలపై నుంచి నీరు ప్రవహిస్తూ ఆయా గ్రామాలకు రాకపోకలు స్తంభింపజేస్తా యి. లింగారావుపాలెం గ్రామాన్ని పడమర వా గు, నక్కవాగులు చుట్టుముట్టడంతో భారీ వర్షాల కు రాకపోకలు స్తంభిస్తాయి. తిమ్మాపురం, యడ్ల పాడు వైపు చీలి ప్రవహించే ఉప్పవాగు, నక్కవాగులు తిరిగి జగ్గాపురం శివారులో కలిసి లోతట్టు ప్రాంతాల్ని అతలాకుతలం చేస్తున్నాయి.

పల్నాడు1
1/8

పల్నాడు

పల్నాడు2
2/8

పల్నాడు

పల్నాడు3
3/8

పల్నాడు

పల్నాడు4
4/8

పల్నాడు

పల్నాడు5
5/8

పల్నాడు

పల్నాడు6
6/8

పల్నాడు

పల్నాడు7
7/8

పల్నాడు

పల్నాడు8
8/8

పల్నాడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement