సమస్యలకు ‘చెక్’ పెట్టాలంటే...
ప్రతిఏటా ఇదే కష్టాన్ని అనుభవిస్తున్న మండల ప్రజలకు ఇకనైనా శాశ్వత పరిష్కారం చూ పాల్సిన బాధ్యత అధికారుల పై ఉంది. బలహీనంగా ఉన్న కరకట్టలను పటిష్టం చేయాలి. గండ్లు పడిన ప్రదేశాలలో మరమ్మతులు పూర్తిచేయా లి. వాగుల లోపలి వైపు, నీటి పరివాహక ప్రాంతాలలో ప్రవాహానికి అడ్డుపడే పిచ్చి మొక్కలు, ముళ్ల కంప పూర్తిగా తొలగించాలి. నీరు స్వేచ్ఛగా పారేలా మార్గాన్ని సుగమం చేయాలి. లోలెవల్ చప్టాల స్థానంలో రాకపోకలకు ఇబ్బందులు లేకుండా కనీ సం కాజ్‌వేలనైనా నిర్మించాలి. వేసవిలో వాగు లోప ల, అధిక నీరు చేరే ప్రాంతాలలో కరకట్టకు దూరంగా రీచార్జ్ పిట్‌లను, ఇంకుడు గుంతలను ఏర్పాటు చేయాలి. సమీప పంటపొలాల్లో చిన్న చెరువులను ఏర్పాటు చేసి, చిన్న కాలువల ద్వారా వరద నీరు వాటికి మళ్లేలా రైతులకు అవగాహన కల్పించాలి. చర్య ల ద్వారా వరద నష్టాన్ని తగ్గించడమే కాకుండా, వృథాగా పోతున్న వర్షం నీటిని భూమి లోకి ఇంకించి, భూగర్భ జలాలు పెరిగేలా చేసి, ప్రజలకు తిరిగి ఉపయోగించుకునే వీలు కలుగుతుంది. యడ్లపాడు ప్రజల కన్నీటి కష్టాలు తీరి, ప్రతి వర్షపు చినుకు వరంగా మారే రోజు కోసం ఎదురుచూస్తున్నారు.


