తప్పిపోయిన బాలిక తల్లిదండ్రులకు అప్పగింత
నరసరావుపేట టౌన్: తప్పిపోయిన బాలికను తల్లిదండ్రులకు అప్పగించిన సంఘటన గురువారం పట్టణంలో చోటుచేసుకుంది. టూటౌన్ పోలీసుల కథనం ప్రకారం.. పెద్దచెరువు మూడు బావుల సెంటర్ వద్ద నివాసం ఉంటున్న నాలుగేళ్ల వేల్పూరి ఎస్తేరు ఇంటి బయట ఆడుకుంటూ కనిపించకుండా పోయింది. ఈ మేరకు తల్లి వేల్పూరి మంగమ్మ ఇచ్చిన ఫిర్యాదుతో టూటౌన్ ఎస్‌ఐ లేఖాప్రియాంక సిబ్బందితో కలిసి పరిసర ప్రాంతాలంతా గాలించారు. బరంపేట శిశుమందిర్ వద్ద ఆచూకిని కనుగొని బాలికను తల్లిదండ్రులకు పోలీసులు అప్పగించారు. తప్పిపోయిన బాలికను వెతికి పట్టుకోవడంలో ప్రతిభ కనపరిచిన ఎస్‌ఐను డీఎస్పీ హనుమంతరావు అభినందించారు.


