ఘనంగా కాశీ విశ్వేశ్వరస్వామి తెప్పోత్సవం
నకరికల్లు: శ్రీ అన్నపూర్ణా సమేత కాశీ విశ్వేశ్వరస్వామి వారి తెప్పోత్సవం వేడుకలు గురువారం కనుల పండువగా సాగాయి. ఆలయ ప్రాంగణంలోని కోనేటిలో పలుప్రాంతాల నుంచి సేకరించిన పూలతో అలంకరించిన హంస వాహనంపై స్వామివార్ల ఉత్సవమూర్తులు కొలువుదీరగా తెప్పోత్సవం సాగింది. భక్తుల శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. అర్చకులు కొమ్మవరపు పవన్‌కుమార్ శర్మ ఆధ్వర్యంలో వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ విశేషపూజలు చేశారు. పలు ప్రాంతాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించారు.


