
అర్జీల సత్వర పరిష్కారమే లక్ష్యం
నరసరావుపేట: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అందిన అర్జీల సత్వర పరిష్కారమే లక్ష్యంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌కు ద్వారా జిల్లా నలుమూలలు నుంచి వచ్చిన అర్జీదారులు నుంచి 141 అర్జీలను జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే, జిల్లా రెవెన్యూ అధికారి ఏకా మురళి, అధికారులతో కలిసి కలెక్టర్ స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ అర్జీల పరిష్కారంలో ఎటువంటి జాప్యానికి తావులేకుండా నాణ్యతతో సంతృప్తే ధ్యేయంగా పరిష్కరించాలన్నారు. అర్జీలు రీ–ఓపెన్ కాకుండా పరిష్కార చర్యలు ఉండాలన్నారు. ఫిర్యాదుదారులతో ముఖాముఖీగా మాట్లాడి సమస్యలను తెలుసుకుని పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. జిల్లా అధికారులు వారి శాఖలకు సంబంధించిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించాలని కోరారు. జిల్లా అధికారులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ అరుణ్‌బాబు