బార్ అండ్ రెస్టారెంట్‌లకు దరఖాస్తులు
● నరసరావుపేట 18, చిలకలూరిపేట 11, సత్తెనపల్లి 5, పిడుగురాళ్ల 6, మాచర్ల 5, వినుకొండ 6, గురజాల 1, దాచేపల్లి 2 బార్ అండ్ రెస్టారెంట్లకు నేటి నుంచి 26వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. 28వ తేదీ లాటరీ పద్ధతిలో జిల్లా కలెక్టర్ సమక్షంలో కేటాయింపు జరుగుతుందన్నారు. అదే విధంగా గీత కార్మికులకు కేటాయించిన బార్ అండ్ రెస్టారెంట్‌ల దరఖాస్తులకు 29వ తేదీ చివరి తేదీ అన్నారు. వారికి 30వ తేదీ లాటరీ తీయటం జరుగుతుందన్నారు.
● ఒక్కో దరఖాస్తుకు నాన్ రిఫండ్‌బుల్ దరఖాస్తు ఫీజు రూ.5 లక్షలుగా ప్రభుత్వం నిర్ణయించిందని, ప్రతి బార్ అండ్ రెస్టారెంట్‌కు కనీసం నాలుగు దరఖాస్తులు ఉండాలన్నారు. నిర్దేశించిన దరఖాస్తులు రాకుంటే ఆయా బార్‌లకు తిరిగి టెండర్ కోరటం జరుగుతుందన్నారు.
● ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. ఒక వ్యక్తి ఎన్ని బార్‌లకై నా దరఖాస్లు చేసుకోవచ్చన్నారు. లాటరీ పద్ధతిలో కేటాయించబడిన వెంటనే సంవత్సరం లైసెన్స్ ఫీజులో ఆరో వంతు అదే రోజు చలనా రూపంలో చెల్లించాలన్నారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు బార్ అండ్ రెస్టారెంట్ల నిర్వహణకు ప్రభుత్వం సమయపాలన విధించిందన్నారు. కార్యక్రమంలో ఏఈఎస్ రవీంద్ర, సీఐ సోమయ్య పాల్గొన్నారు.
జిల్లాలో కొత్తగా 54 బార్‌లకు అనుమతులు 28వ తేదీన లాటరీ పద్ధతిలో దుకాణాల కేటాయింపు
నరసరావుపేట టౌన్: పల్నాడు జిల్లాలో 54 బార్ అండ్ రెస్టారెంట్‌లకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఎకై ్సజ్ సూపరింటెండెంట్ కె.మణికంఠ తెలిపారు. సోమవారం ఎకై ్సజ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఓపెన్ కేటగిరిలో 49, గీత కార్మిక కులాలకు 5 బార్ అండ్ రెస్టారెంట్‌లను ప్రభుత్వం కేటాయించిందన్నారు. మున్సిపాలిటీలకు సంబంధించి ఏడాదికి రూ.55 లక్షలు, నగర పంచాయతీలకు రూ.35 లక్షలుగా ఫీజు నిర్థారించిందన్నారు. ఆరు విడతలుగా లైసెన్స్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. అలాగే గీత కార్మికులకు కేటాయించిన బార్‌లకు నిర్థేశించి లైసెన్స్ ఫీజులో సగం మాత్రమే చెల్లిస్తే సరిపోతుందన్నారు.