వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర విభాగంలో జిల్లా నేతలకు చోటు | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర విభాగంలో జిల్లా నేతలకు చోటు

Aug 17 2025 6:17 AM | Updated on Aug 17 2025 6:17 AM

వైఎస్

వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర విభాగంలో జిల్లా నేతలకు చోటు

వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర విభాగంలో జిల్లా నేతలకు చోటు వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ఆర్‌టీయూసీ విభాగం సంయుక్త కార్యదర్శిగా ఏడుకొండలు మీ కోసం కాల్‌ సెంటర్‌ సేవలను వినియోగించుకోండి వంకాయలపాడు వద్ద రోడ్డు ప్రమాదం ఆటోను ఢీకొన్న లారీ నేడు, రేపు సీపీఐ జిల్లా మహాసభలు లక్ష్మీపురం: గుంటూరు నగరంలో ఆది, సోమవారాలలో సీపీఐ గుంటూరు జిల్లా 26వ మహాసభలు జరగనున్నాయని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. గుంటూరు కొత్తపేటలోని పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహాసభలకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు తదితర నాయకులు హాజరుకానున్నారని తెలియజేశారు.

నరసరావుపేట: వైఎస్సార్‌ సీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పల్నాడు జిల్లాకు చెందిన ఇరువురు నాయకులను పార్టీ రాష్ట్ర విభాగంలో నియమిస్తూ కేంద్ర పార్టీ కార్యాలయం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఇరిగిదిండ్ల లాజర్‌ను రాష్ట్ర పంచాయతీరాజ్‌ విభాగ సంయుక్త కార్యదర్శిగా, పెదకూరపాడు అసెంబ్లీ నియోజకర్గానికి చెందిన షేక్‌ దస్తగిరిని రాష్ట్ర బీసీ విభాగ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు.

భట్టిప్రోలు: వైఎస్సార్‌ సీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర ఆర్‌టీయూసీ విభాగం సంయుక్త కార్యదర్శిగా వేమూరుకు చెందిన బొల్లిముంత ఏడుకొండలును నియమిస్తూ శనివారం పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ఏడుకొండలు నియామకం కోసం వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త, రాష్ట్ర అధికార ప్రతినిధి వరికూటి అశోక్‌బాబు కృషి చేశారు. ఏడుకొండలు నియామకంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు.

– జిల్లా కలెక్టర్‌ పి అరుణ్‌ బాబు

నరసరావుపేట: మీ కోసం కాల్‌ సెంటర్‌ 1100 సేవలను వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్‌ పి.అరుణ్‌బాబు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అర్జీదారులు దాఖలు చేసిన తమ అర్జీలు ఇప్పటికీ పరిష్కారం కాకపోయినా, లేదా తమ ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి 1100 నంబర్‌కు కాల్‌ చేయవచ్చునన్నారు. అర్జీదారులు వారి అర్జీలు నమోదు చేసుకోవడానికి మీకోసం డాట్‌ ఏపీ డాట్‌ జీవోవి డాట్‌ ఇన్‌ వెబ్‌సైట్‌లో వారి అర్జీలు నమోదు చేసుకోవచ్చన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ సమస్యలకు పరిష్కారం పొందాలని జిల్లా కలెక్టర్‌ విజ్ఞప్తి చేశారు. ఈనెల 18వ తేదీన కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించటం జరుగుతుందని పేర్కొన్నారు.

– దంపతులకు తీవ్ర గాయాలు

యడ్లపాడు: రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో భార్యాభర్తలకు గాయాలైన సంఘటన మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...గుంటూరు నుంచి చిలకలూరిపేట వైపు బైక్‌పై భార్యాభర్తలు ప్రయాణిస్తున్నారు. అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వస్తున్న ఒక స్కూటీ వీరి బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వాహనాలు ధ్వంసం కావడంతోపాటు దంపతులిద్దరూ బైక్‌పై నుంచి కిందపడిపోయి తీవ్ర గాయాలపాలయ్యారు. స్థానికులు స్పందించి క్షతగాత్రులను చిలకలూరిపేట ఆసుపత్రికి తీసుకెళ్లారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం వారిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు పోలీసుల విచారణలో వెల్లడికావాల్సి ఉంది.

ఇద్దరికి తీవ్రంగా..నలుగురికి స్వల్ప గాయాలు

పిడుగురాళ్ల: ఆటోను వెనుక నుంచి లారీ ఢీకొన్న సంఘటనలో ఆరుగురికి గాయాలైన సంఘటన పిడుగురాళ్ల పట్టణంలోని కళ్లం టౌన్‌షిప్‌ వద్ద చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించి సేకరించిన వివరాల మేరకు... మాచవరం మండలం చెన్నాయపాలెం గ్రామం నుంచి ఐదుగురు నరసరావుపేటలోని ఇస్కాన్‌ ఆలయానికి ఆటోలో బయలుదేరారు. మార్గంమధ్యలో ఈశ్వరమ్మ, సారంగమ్మలు అయ్యప్పనగర్‌ వద్ద ఆటో ఎక్కారు. హైదరాబాద్‌ నుంచి గుంటూరు వెళ్తున్న కంటైనర్‌ లారీ ఆటోను ఢీకొంది. ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా, నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. తీవ్ర గాయాలైన ఈశ్వరమ్మ, సారంగమ్మలను 108 వాహనం ద్వారా, నామ్స్‌ ఎక్స్‌ప్రెస్‌ అంబులెన్స్‌లో పిడుగురాళ్ల పట్టణంలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. ఘటనకు కారణమైన లారీ డ్రైవర్‌ వాహనాన్ని అక్కడే వదిలిపెట్టి పరారయ్యాడు. సమాచారం తెలుసుకున్న ఎస్‌ఐ మోహన్‌ సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.

ప్రమాదంలో గాయపడిన ఈశ్వరమ్మ, సారంగమ్మ

వైఎస్సార్‌ సీపీ  రాష్ట్ర విభాగంలో జిల్లా నేతలకు చోటు 1
1/2

వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర విభాగంలో జిల్లా నేతలకు చోటు

వైఎస్సార్‌ సీపీ  రాష్ట్ర విభాగంలో జిల్లా నేతలకు చోటు 2
2/2

వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర విభాగంలో జిల్లా నేతలకు చోటు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement