
కూలిన పాటిబండ్ల చిన్న బ్రిడ్జి
పెదకూరపాడు: పెదకూరపాడులో మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు పలు గ్రామాల్లో బ్రిడ్జిలు, చప్టాలు కూలిపోయాయి. పాటిబండ్ల– పెదకూరపాడు మధ్య ఉన్న చిన్న బ్రిడ్జి వరద ఉధృతికి కూలిపోయింది. 75త్యాళ్ళూరు గ్రామంలోని జెడ్పీ పాఠశాలకు వెళ్లే రహదారిలో చప్టా కోతకు గురైంది. 75 త్యాళ్ళూరు – కాశిపాడు వద్ద ఉన్న లోలెవెల్ చప్టా పూర్తిగా కోతకు గురైంది. దీంతో ఆయా గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పాటిబండ్ల వద్ద బ్రిడ్జిని సత్తెనపల్లి ఆర్డీవో రమకాంత్‌రెడ్డి, పెదకూరపాడు తహసీల్దార్ ధనలక్ష్మీ, ఎంపీడీవో సోమయాజులు పరిశీలించారు. సంబంధిత ఇంజనీరులకు ఫోన్ చేసి యుద్ధప్రతిపాదికన పనలు చేయాలని ఆదేశించారు. పాటిబండ్ల రోడ్డు పలు చోట్ల కోతకు గురైంది. పాటిబండ్ల బ్రిడ్జి కూలేందుకు సిద్ధం అంటూ గత నెల 29న సాక్షి దినపత్రికలో కథనం ప్రచురితమైంది.
కోతకు గురైన చప్టాలు రాకపోకలకు తీవ్ర అంతరాయం పలు చోట్ల కోట్టుకు పోయిన రోడ్లు ముందే హెచ్చరించిన ‘సాక్షి’

కూలిన పాటిబండ్ల చిన్న బ్రిడ్జి

కూలిన పాటిబండ్ల చిన్న బ్రిడ్జి