
వినుకొండ ఫొటోగ్రాఫర్‌కు గోల్డ్‌మెడల్
వినుకొండ: ఇండియా ఇంటర్నేషనల్ ఫొటో గ్రాఫిక్ కౌన్సిల్, ఫొటోగ్రఫీ అకాడమి ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఆగస్టు 19న ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా 186వ వరల్డ్ ఫొటోగ్రఫీ డే కాంటెస్ట్ నిర్వహించారు. ఈ కాంటెస్ట్‌లో ఫొటో ట్రావెల్ విభాగంలో వినుకొండ పట్టణానికి చెందిన వంగపల్లి బ్రహ్మయ్య తీసిన ప్రకాశం జిల్లా త్రిపురాంతకం రథోత్సవం ఫొటో అవార్డుకు ఎంపికై ంది. ఈ నెల 18వ తేదీన ఉదయం 11గంటలకు విజయవాడలో బాలోత్సవ భవన్‌లో ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ, ఏపీ సృజనాత్మక సంస్కృతి సమితి సీఈవో, డైరెక్టర్ ఆర్ .మల్లికార్జునరావు చేతుల మీదుగా అవార్డును అందుకోనున్నట్లు తెలిపారు.

వినుకొండ ఫొటోగ్రాఫర్‌కు గోల్డ్‌మెడల్