
మెరుగైన విద్యుత్ సరఫరాకు కృషి
ఏపీ సీపీడీసీఎల్ సీఎండీ పి.పుల్లారెడ్డి
మాచర్ల: రాష్ట్రంలో మెరుగైన విద్యుత్ సరఫరాతో పాటు, ఉత్తమ సేవలందించాల్సిన బాధ్యత విద్యుత్ శాఖ ఇంజినీర్లపై ఉందని ఏపీ సీపీడీసీఎల్ సీఎండీ పి.పుల్లారెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని విద్యుత్ శాఖ డివిజినల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన డివిజినల్ పరిధిలోని ఇంజినీర్లు, అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భవిష్యత్తులో కరెంట్ బిల్లుల వసూళ్ల విధానం మారిపోతుందని, బకాయిలు పేరుకుపోకుండా చూసుకోవాలని సూచించారు. బకాయిలు ఉన్న ప్రభుత్వ శాఖల అధికారులను కలిసి బకాయిలు క్లియర్ చేయకపోతే చర్యలు తప్పవని సూచించాలని తెలిపారు. టెక్నికల్ ఎలక్ట్రికల్ డైరెక్టర్ మురళీ కృష్ణ యాదవ్, విజయ్‌కుమార్, ఈఈ ఎన్.సింగయ్యతో పాటు పలువురు డీఈలు, ఏఈలు పాల్గొన్నారు.
స్మార్ట్ మీటర్లు బిగించుకోండి..
రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటుందని సీఎండీ పి.పుల్లారెడ్డి అన్నారు. మాచర్లలోని కేసీపీ అతిథి గృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. స్మార్ట్ మీటర్ల ఏర్పాటుతో పలు ప్రయోజనాలు ఉన్నాయన్నారు.