
జాతీయ సమైక్యతను చాటాలి
నరసరావుపేట రూరల్: జాతీయ పతాకాన్ని ప్రతి భారతీయుడు ఇంటిపై ఎగురవేసి దేశభక్తిని, జాతీయ సమైక్యతను చాటాలని పల్నాడు జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు అన్నారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా సోమవారం పట్టణంలో ఘర్ తిరంగా అభియాస్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని జిల్లా కలెక్టర్ అరుణ్‌బాబు ప్రారంభించారు. పల్నాడు బస్టాండ్ నుంచి గాంధీ పార్క్ వరకు భారీ జాతీయ పతాకంతో విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు. కార్యక్రమంలో డిఆర్‌వో మురళీ, ఆర్‌డీవో మధులత తదితరులు పాల్గొన్నారు.
బీసీ బాలుర వసతి గృహం వార్డెన్ సస్పెన్షన్
దాచేపల్లి : నారాయణపురం ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహం వార్డెన్ డి.దీపిక సస్పెండ్ అయ్యారు. అలాగే హాస్టల్ నైట్‌వాచ్‌మన్ సంజేశ్వరావును విధుల నుంచి తొలగిస్తూ జిల్లా కలెక్టర్ పి. అరుణబాబు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహంలో జూనియర్ విద్యార్థిపై ఆరుగురు సీనియర్ విద్యార్థులు దాడి చేసి కరెంట్ షాక్ ఇచ్చి హతమార్చేందుకు ప్రయత్నించారు. సంక్షేమ హాస్టల్లో విద్యార్థులకు రక్షణలేని అంశాలపై సాక్షి దినపత్రిక ఈనెల 11న సంక్షేమం ప్రశ్నార్థకం శీర్షికన కథనాన్ని ప్రచురించింది.
దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వార్డెన్ దీపికను సస్పెండ్ చేయగా, నైట్ వాచ్‌మన్ సంజేశ్వరావుని విధుల నుంచి తొలగించారు. బీసీ బాలురు వసతి గృహానికి వార్డెన్‌గా గంగాధర్‌రావును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిలా ఉండగా హాస్టల్‌లో జూనియర్ విద్యార్థిపై దాడి చేసిన ఆరుగురు విద్యార్థులపై దాచేపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి స్టేషన్ బెయిలు మంజూరు చేశారు.

జాతీయ సమైక్యతను చాటాలి

బీసీ బాలుర వసతి గృహం వార్డెన్ సస్పెన్షన్