
అదుపుతప్పి ఆటో బోల్తా
క్రోసూరు: ఊటుకూరు–కస్తల మధ్యలో ఆదివారం అదుపు తప్పి ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయి. ఎస్‌ఐ పి.రవిబాబు తెలిపిన వివరాలు.. బెల్లంకొండ మండలం నాగిరెడ్డిపాలేనికి చెందిన 10 మంది అచ్చంపేట మండలం కస్తలలోని తమ బంధువుల ఇంటిలో జరిగే పుష్పాలంకరణ వేడుకకు ఆటోలో బయలుదేరారు. క్రోసూరు మండలం ఊటుకూరు మీదగా కస్తల వెళ్లి తిరిగి వస్తూ ఊటుకూరు పరిధిలో అదుపు తప్పి ఆటో పొలాల్లోకి దూసుకెళ్లింది. ఆటోలో ఐదుగురు మహిళలు, ఆరుగురు పురుషులు, డ్రైవర్‌తో కలిపి 11 మంది ప్రయాణిసున్నారు. ఈ ప్రమాదంలో వృద్ధుడు చావలి వెంకటేశ్వర్లు(66) అక్కడిక్కడే మృతిచెందాడు. మిగిలిన వారికి స్వల్ప గాయాలు కాగా సత్తెనపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
ఒకరు మృతి 11 మందితో వెళ్తుండగా ప్రమాదం