
వెటర్నరీ అసిస్టెంట్ అసోసియేషన్ కార్యదర్శిగా వేమారెడ్డ
రొంపిచర్ల: ఆంధ్రప్రదేశ్ వెటర్నరీ అసిస్టెంట్ అసోసియేషన్ కార్యదర్శిగా పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం వి.రెడ్డిపాలెం గ్రామానికి చెందిన దుద్దుకుంట వేమారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఆదివారం విజయవాడలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ వెటర్నరీ అసిస్టెంట్ అసోసియేషన్ సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారిగా వ్యవహరించిన ఏపీ ఎన్‌జీవోస్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ జె.జగదీశ్‌రావు నుంచి నియామాక ఉత్తర్వులు అందుకున్నారు. వేమారెడ్డి గతంలో జిల్లా అసోసియేషన్‌లో పలు పదవులు నిర్వహించారు. రాష్ట్ర వెటర్నరీ అసిస్టెంట్ అసోసియేషన్ కార్యదర్శిగా ఎంపికై న వేమారెడ్డిని సహచర ఉద్యోగులు, ఆ గ్రామ పెద్దలు అభినందించారు.
12 సొసైటీలకు త్రీమెన్
కమిటీల నియామకం
నరసరావుపేట: పల్నాడు జిల్లాలోని 12 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు ప్రభుత్వం ఆదివారం త్రిసభ్య కమిటీ నియామకం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని 821 పీఏ సీఎస్‌లకు కమిటీలను నియామకం చేసింది. కాగా పల్నాడు జిల్లాలోని వీరాపురం సొసైటీకి వై. శివన్నారాయణను చైర్ పర్సన్‌గా నియమించగా, పెదఅగ్రహారం సొసైటీకి పి. మరియమ్మ, మాచవరం సొసైటీకి పసుపులేటి పూర్ణయ్య, మాచర్ల సొసైటీకి జి. సత్యనారాయణరెడ్డి, దుర్గి సొసైటీకి కటకం రామ్మోహన్‌రావు, నందిరాజుపాలెం సొసైటీకి ఓర్చు ఆనందరావు, ధూళిపాళ ఏబీఎఫ్‌ఎస్‌సీఎస్‌కు కె.సుబ్బారావు, ముప్పాళ్లకు జెట్టి నాగమల్లేశ్వరరావు, మాదల సొసైటీకి చిమటా పోల్‌రాజు, మర్రిపాలెం సొసైటీకి కుర్రా రత్తయ్య, యడ్లపాడు సొసైటీకి ఎం. వెంకట సుబ్బారావు, బొల్లాపల్లి సొసైటీకి పి.వెంకటనారాయణను చైర్ పర్సన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. వీరితో పాటు సొసైటీకి ఇరువురు చొప్పున పర్సన్‌ల నియామకం చేసింది. వీరు ఈ పదవుల్లో 2026 జనవరి 30వ తేదీ వరకు కొనసాగుతారు.
గుండెపోటుతో
హెడ్ కానిస్టేబుల్ మృతి
జె.పంగులూరు: మండలంలోని రేణింగవరం పోలీస్‌స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న పర్వతరెడ్డి వెంకటస్వామి (52) గుండెపోటుతో ఆదివారం మృతి చెందారు. వెంకటస్వామి రేణింగవరం పోలీస్‌స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. అతని స్వగ్రామం చిన్నగంజాం మండలం సోపిరాల. ఆయన అస్వస్థతకు గురికావడంతో ఒంగోలు కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. వెంకటస్వామికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారివురికి వివాహం చేశాడు. వెంకటస్వామి భౌతికకాయాన్ని రేణింగవరం ఎస్సై వినోద్‌బాబు, సిబ్బంది సందర్శించి నివాళులర్పించారు.

వెటర్నరీ అసిస్టెంట్ అసోసియేషన్ కార్యదర్శిగా వేమారెడ్డ