
రాష్ట్ర స్థాయి ఆట్యా–పాట్యాలో ప్రథమస్థానం
నకరికల్లు: రాష్ట్రస్థాయి ఆట్యా–పాట్యా క్రీడాపోటీల్లో పల్నాడు జిల్లా జట్లకు ప్రథమస్థానం దక్కింది. ఒంగోలులో ఈ నెల 9, 10వ తేదీలలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీలలో పల్నాడు జిల్లా బాలికల, బాలుర జట్లు ప్రథమ స్థానంలో నిలిచాయి. నకరికల్లు ఉన్నతపాఠశాల విద్యార్థులు 11 మంది, దేచవరం ఆదర్శపాఠశాల విద్యార్థులు ముగ్గురు పల్నాడు జిల్లా జట్టులో స్థానం సంపాదించారు. జిల్లా జట్టుకు ఎంపికై న క్రీడాకారులకు నకరికల్లు ఉన్నత పాఠశాలలోనే శిక్షణ ఇచ్చారు. బాలికల జట్టు కోచ్‌గా నకరికల్లు ఉన్నతపాఠశాల ఫిజికల్ డైరెక్టర్ జి.ఝాన్సీరాణి, బాలుర జట్టుకు కోచ్‌గా ఫిజికల్ డైరెక్టర్ చింతా పుల్లయ్య, మేనేజర్‌గా పి.తిరుపతిరావు వ్యవహరించారు. క్రీడాకారులను ఏపీ ఆట్యా–పాట్యా సీఈఓ రంభ.ప్రసాద్, కార్యదర్శి శ్రీ చరణ్, అధ్యక్షుడు జాబేబ్, జిల్లా అధ్యక్షురాలు చింతా సామ్రాజ్యం తదితరులు అభినందించారు.