
మృత్యువులోనూ వీడని బంధం
పెదకాకాని: ఆత్మహత్య చేసుకున్న స్నేహితుడి అత్యక్రియలకు వెళ్లి ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఓ యువకుడు మృతి చెందిన ఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. గుంటూరు అరుంధతీనగర్‌కు చెందిన షేక్ సాధిక్ (21) గడ్డిపాడు సమీపంలోని మహేంద్ర షోరూంలో పని చేస్తున్నాడు. ఈనెల 6న స్నేహితుడు రమణను బైక్‌పై ఎక్కించుకుని గుంటూరు నుంచి తెనాలి వయా నందివెలుగు మీదుగా బయలు దేరారు. మార్గమధ్యలో తక్కెళ్లపాడు శివారులోకి చేరుకునే సరికి ఎదురుగా వెళుతున్న లారీ సడన్ బ్రేక్ వేయడంతో దాన్ని ఢీకొట్టారు. ఈ ఘటనలో బైక్ నడుపుతున్న షేక్ సాదిక్‌తో పాటు వెనుక కూర్చున్న రమణకు తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరినీ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో షేక్ సాధిక్(21) పరిస్థితి విషమించి శుక్రవారం మరణించాడు. మరో యువకుడు రమణ పరిస్థితి విషమంగా ఉంది.
అంత్యక్రియలకు వెళ్లి వస్తూ ..
ప్రేమో, శారీరక ఆకర్షణో తెలియదు గానీ పట్టుమని 18 ఏళ్లు కూడా నిండని గుంటూరు ఆర్‌టీసీ కాలనీకి చెందిన కొండూరు శివశంకర్ నందివెలుగు రోడ్డులో ఉన్న రైల్వే ట్రాక్ పైకి చేరుకుని, సోదరుడికి ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు మాట్లాడుతూనే రైలు కింద పడటంతో శరీరం ముక్కలైంది. ఈనెల 6న కుటుంబసభ్యులు శివశంకర్ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు తెనాలి బయలు దేరారు. మిత్రుడి పోస్టుమార్టం పూర్తయ్యే వరకూ సాధిక్, రమణలు అక్కడే గడిపారు. మృతదేహం వెంట తెనాలి బయలు దేరారు. ఇంతలోనే లారీ రూపంలో వెంటాడిన మృత్యువు సాధిక్‌ను కబళించింది.
ఆత్మహత్య చేసుకున్న స్నేహితుడిని చూసేందుకు వెళ్లి గాయపడిన ఇద్దరు యువకులు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఒకరి మృతి మరొకరి పరిస్థితి విషమం

మృత్యువులోనూ వీడని బంధం