
ఉంగరం మింగిన ఐదు నెలల చిన్నారి
గొంతులో అడ్డుపడిన ఉంగరాన్ని బయటకు తీసిన వైద్యులు
నరసరావుపేట రూరల్: వెండి ఉంగరాన్ని మింగి ఐదు నెలల పాప తీవ్ర అస్వస్థతకు గురవడంతో వైద్యులు సకాలంలో స్పందించి ఉంగరాన్ని బయటకు తీయడంతో ప్రాణాపాయం తప్పింది. వివరాల్లోకి వెళితే.. ఫిరంగిపురం మండలం మునగపాడు గ్రామానికి చెందిన షేక్ సుభాని ఐదు నెలల కుమార్తె సిద్రహా చేతివేళ్లను నోటిలో పెట్టుకొని ఆడుకుంటున్న సమయంలో వేలికి ఉన్న వెండి ఉంగరం నోటిలోకి జారింది. కొంతసేపటికి చిన్నారి అస్వస్థతకు గురికావడంతో తల్లిదండ్రులు సిద్రహాను హుటాహుటిన నరసరావుపేట శంకుతల జనరల్ గ్రాస్ట్రో లివర్‌కేర్ ఆసుపత్రికి తరలించారు. గొంతులో అడ్డుపడిన ఉంగరాన్ని డాక్టర్ ఐలా శ్రీనివాస్, సిబ్బంది ఎండోస్కోపి విధానంలో బయటకు తీశారు. సకాలంలో స్పందించి ఆసుపత్రికి తీసుకురావడంతో చిన్నారికి ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు.

ఉంగరం మింగిన ఐదు నెలల చిన్నారి