
రాష్ట్రంలో చేనేత కార్మికుల స్థితి దుర్భరం
సత్తెనపల్లి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న చేనేత వ్యతిరేక విధానాలతో రాష్ట్రంలో చేనేత కార్మికుల స్థితిగతులు మరింత దుర్భరంగా మారాయని ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి పిల్లలమర్రి బాలకృష్ణ అన్నారు. పట్టణంలోని పుచ్చలపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గురువారం జరిగిన సభకు చేనేత కార్మిక సంఘ నాయకుడు అనుముల వీరబ్రహ్మం అధ్యక్షత వహించారు. బాలకృష్ణ మాట్లాడుతూరాష్ట్రంలో పవర్ లూమ్స్ అధికంగా రావడం వల్లన చేనేత కార్మికులకు చాలీచాలని వేతనాలు వస్తూ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు.ఽ ధర్మవరంలో పవర్‌లూమ్ కంటే అధునాతన మైన యంత్రాలు రావడంతో చేనేత కార్మికులు పనులు కోల్పోయి కుటుంబాలు గడవక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి, చేనేత రంగ పరిరక్షణకు ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకోవాలన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన విధంగా ప్రతి చేనేత కార్మికునికి నేతన్న నేస్తం అమలు చేయాలన్నారు. ప్రతి చేనేత కార్మికుని కుటుంబానికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు అమలు చేయాలన్నారు. చేనేత రంగ పరిరక్షణకు11 రకాల రిజర్వేషన్లు అమలు జరపాలన్నారు. చేనేత సహకార సంఘాలకు ప్రభుత్వం ఇవ్వాల్సిన యారన్ సబ్సిడీ, పావలా వడ్డీ రిబేటు క్రింద రూ. 156 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సహకార సంఘాలు దివాలా తీయకుండా ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
సత్తెనపల్లిలో 11వ రాష్ట్ర మహాసభలు
ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం 11వ రాష్ట్ర మహాసభలు సత్తెనపల్లిలో అక్టోబర్ 6,7 తేదీలలో జరగనున్నాయని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కట్టా శివ దుర్గారావు, పిల్లలమర్రి బాలకృష్ణ తెలిపారు. ఈమేరకు 51 మందితో ఆహ్వాన సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. ఆహ్వాన సంఘం అధ్యక్ష కార్యదర్శులుగా కట్టా శివ దుర్గారావు, పిల్లలమర్రి బాలకృష్ణలను ఎన్నుకున్నారు. మహాసభలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న చేనేత వ్యతిరేక విధానాలపై సుదీర్ఘంగా చర్చించడం జరుగుతుందన్నారు. ఆహ్వాన సంఘం గౌరవ అధ్యక్షుడు డాక్టర్ అనంత వెంకట్రావు, గౌరవ సలహాదారులు మున్నూరు భాస్కరయ్య, ఉపాధ్యక్షులు గద్దె చలమయ్య, కామర్తి రాజు, సహాయ కార్యదర్శులు డోకుపర్తి రామారావు, వాస గంగాధరరావు తదితరులు మహాసభ నిర్వహణ, ఏర్పాట్లపై అనేక సూచనలు, సలహాలు చేశారు.
సత్తెనపల్లిలో అక్టోబర్ 6,7 తేదీలలో ఏపీ చేనేత కార్మిక సంఘం
రాష్ట్ర మహాసభలు
సంఘం రాష్ట్ర కార్యదర్శి బాలకృష్ణ